Peddi Updates: షూటింగ్ లో రామ్ చరణ్‌ చేసిన పనికి 'పెద్ది' టీమ్ షాక్..!

రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పెద్ది’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర యాసలో చరణ్‌ కొత్తగా కనిపించనున్నారు. జన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 27, 2026న సినిమా విడుదల కానుంది.

New Update
Peddi Updates

Peddi Updates

Peddi Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న తాజా పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరణ్ కెరీర్‌లోనే అత్యంత బారి బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. దాదాపు రూ. 300 కోట్లకుపైగా ఖర్చుతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాపై చరణ్ చూపిస్తున్న పర్ఫెక్షన్‌ టీమ్‌ మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు షూట్ అయిన ఫుటేజ్‌ను డైరెక్టర్ బుచిబాబు సానతో కలిసి ఆయన పరిశీలిస్తున్నారట. అవసరమైతే కొన్ని సన్నివేశాలను తిరిగి షూట్ చేయిస్తున్నట్టు సమాచారం. చరణ్‌ డెడికేషన్ చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరాంధ్ర మాండలికంలో చరణ్‌ డైలాగ్స్

ఈ సినిమాలో రామ్ చరణ్‌ చాలా గంభీరమైన, మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర మాండలికంతో ఆయన పలికే డైలాగ్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అవుతాయని టాక్. పాత్రకు సరిపోయేలా చరణ్ తన డైలాగ్ మోడ్యులేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

జన్వీ కపూర్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆర్.ఆర్. ఏ.ఆర్. రెహ్మాన్.

శరవేగంగా షూటింగ్

ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం పుణేలో చరణ్-జన్వీపై పాటను చిత్రీకరించేందుకు తదుపరి షెడ్యూల్‌ మొదలైంది. ఈ పాటకు జాని మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాట మెలోడీతో పాటు ఎనర్జీతో ఉండబోతోంది.

ఈ పాట దృశ్యాలు గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మిగతా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఇదివరకే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ నవీన్ నూలి నేతృత్వంలో పూర్తయ్యింది.

మార్చి 27, 2026న విడుదలే.. మార్పు లేదు

ఈ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పష్టం చేశారు. విడుదల తారీఖులో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా విజయంతో చరణ్‌కు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.

Peddi సినిమా కోసం రామ్ చరణ్ చూపిస్తున్న పట్టుదల, డెడికేషన్, సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అభిమానులు ఇప్పుడు మిగతా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు