/rtv/media/media_files/2026/01/24/peddi-postponed-2026-01-24-20-08-13.jpg)
Peddi Postponed
Peddi Postponed: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ తేదీకి రిలీజ్ కష్టం అనే చర్చ జోరుగా నడుస్తోంది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ను మే లేదా జూన్ నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక కొత్త డేట్ బాగా వైరల్ అవుతోంది. 2026 సమ్మర్ సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 1వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌పై పరిశీలన జరుగుతోందని సమాచారం. ఇప్పటికి ఇది ఫైనల్ కాదని, ఫిక్స్ అయితే అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. రామ్ చరణ్‌పై ఓ పవర్‌ఫుల్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా సుమారు నెల రోజుల షూటింగ్ మిగిలి ఉందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ అయిందని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని టాక్.
ఈ సినిమాకు ఇప్పటికే విడుదల చేసిన ‘చికిరి చికిరి’ పాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరిలో రెండో పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి జరుగుతున్నా, ఇంకా చాలావరకు పని మిగిలి ఉందని సమాచారం. షూటింగ్ పూర్తి చేయాలి, ఆ తర్వాత మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేయాలి. అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక్క పాట మాత్రమే విడుదల చేయగా, ఇంకా చాలా కంటెంట్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ చూసుకుంటే మార్చి నెలలో సినిమా రావడం కష్టమేనని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
అందుకే మార్చి బదులు మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేయడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారట. సమ్మర్ సీజన్‌లో సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సినిమాలకు మంచి ఆదరణ దొరికే అవకాశం ఉంటుంది. అయితే అందుకు సరైన రిలీజ్ డేట్ కూడా కావాలి. ప్రస్తుతం మే 1 తేదీ పరిశీలనలో ఉన్న డేట్‌గా తెలుస్తోంది.
కానీ మే 1పై ఇప్పటికే అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా రానుంది. ఆ సినిమాను మే డే సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకమని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ‘పెద్ది’ కూడా అదే డేట్‌కు వస్తే, ‘లెనిన్’ మరో తేదీ చూసుకోవాల్సి రావచ్చు. అయితే ఇది ఇప్పటికి గాసిప్ మాత్రమే.
ఇదిలా ఉండగా, కొంతమంది మెగా అభిమానులు ‘పెద్ది’ వాయిదా వేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మార్చి చివర్లో టాక్సిక్, దురంధర్ 2 వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిపై అంచనాలు ఎక్కువగా ఉండటంతో, అవి హిట్ అయితే ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే కాస్త ఆలస్యంగా విడుదల చేయడం మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాత్రం మార్చి 26నే ‘పెద్ది’ రిలీజ్ అవుతుంది అని చెప్పారు. మరి అసలు ఫైనల్ డేట్ ఏంటో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Follow Us