/rtv/media/media_files/2025/11/16/rajamouli-2025-11-16-18-32-27.jpg)
Rajamouli
Rajamouli: తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన SS రాజమౌళి అనే పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన సినిమాలు అంటే అన్ని బాషల సినీ ప్రేమికులు చాలా ఇష్టపడతారు. సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తర్వాత, ఈ రోజుల్లో రాజమౌళి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న ఈ దర్శకుడి మాటలు ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది.
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఇటీవల ఆయన #Globetrotter వారణాసి సినిమా మొదటి ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో LED స్క్రీన్ సరిగ్గా పని చేయకపోవడం కారణంగా రాజమౌళి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను దేవుణ్ణి నమ్మను, కానీ మా నాన్న నమ్మతారు, మా భార్య నమ్ముతారు. హనుమంతుడు వారికి ఇష్టం, కానీ దేవుడు నిజంగా ఉంటే ఇలా చేస్తాడా?” అని ఆయన తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, గతంలో కూడా ఆయన శ్రీ రాముడి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. ఒక అభిమాని రాజమౌళిని ట్యాగ్ చేసి శ్రీ రామనవమి శుభాకాంక్షలు చెప్పగా, రాజమౌళి “థాంక్యూ.. కానీ నాకు శ్రీ రాముడు అంటే అసలు ఇష్టం లేదు. నారాయణ అవతారాల్లో నాకు శ్రీ కృష్ణుడు ఎక్కువ ఇష్టం” అని సమాధానం ఇచ్చారు.
@yourstarun85 Tq. But I never liked lord ram. Lord Krishna is my favourite of all the avatars.
— rajamouli ss (@ssrajamouli) April 12, 2011
ఇలాంటి వ్యాఖ్యలు అభిమానులలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు మాత్రం ఆయన మాటలను తప్పుపడుతున్నారు. దేవుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
మొత్తానికి, రాజమౌళి ఒక స్టార్ దర్శకుడిగా తన స్థాయి, అభిమానులను కలిగి ఉన్నప్పటికీ, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం వల్ల వివాదాల కేంద్రంగా మారారు. అభిమానులు, సినీ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు, ఆయన రాబోయే రోజుల్లో మాటల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
Follow Us