/rtv/media/media_files/2025/12/13/maruthi-2025-12-13-09-09-19.jpg)
Maruthi
Maruthi: దర్శకుడు మారుతి ప్రభాస్(Prabhas) తో తీస్తున్న కొత్త సినిమా ‘రాజాసాబ్’(Rajasaab) గురించి ఇటీవల సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఈ సినిమా లెక్క ప్రకారం ఇప్పటికే థియేటర్లలోకి రావాలి. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు. సినిమా ప్రకటించినప్పుడు మారుతిని దర్శకుడిగా ఎంపిక చేయడంపై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి.
#TheRajaSaab Director @maruthi Energetic Speech From @ahavideoIN#3RosesSeason2 Pre Release Event ! pic.twitter.com/s832VL0Inq
— BA Raju's Team (@baraju_SuperHit) December 10, 2025
ఈ ట్రోల్స్ గురించి తాజాగా మారుతి ఆసక్తికరంగా స్పందించారు. ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్కు రాబోతుంది. దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మారుతి తనపై వచ్చిన విమర్శల గురించి, ట్రోలింగ్ గురించి ఓ పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మారుతి మాట్లాడుతూ, “నన్ను అంతగా తిట్టకపోయి ఉంటే నేను ‘రాజాసాబ్’ సినిమా తీసేవాడిని కాదు. ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి” అని అన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న నటి ప్రగతి గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రగతి ఇటీవల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, “ప్రగతి గారికి ఇది చాలా ఎమోషనల్ రోజు. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని బాధపడకండి. అలా ట్రోల్ చేయకపోతే మీరు గోల్డ్ మెడల్ గెలిచేవారు కాదు. అలాగే నన్ను తిట్టకపోతే నేను ఈ సినిమా చేయేవాడిని కాదు” అని అన్నారు.
అలాగే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ, “ట్రోలర్స్ తమ పని అన్నీ పక్కన పెట్టి మన కోసం టైమ్ కేటాయించి తిడుతున్నారు. వాళ్ల దగ్గర ఉన్న నెగెటివిటీనే మనకు పంచుతారు. వాళ్ల దగ్గర నాలుగు తిట్లు తప్ప ఇంకేమీ ఉండదు. ఎవరైనా తిట్టితే దాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి” అన్నారు.
“ట్రోల్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే మేము ముందుకు వెళ్తాం. వాళ్లు మాత్రం అక్కడే ఉంటారు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారందరికీ థ్యాంక్స్. మీరు లేకపోతే మేము ఇంత ముందుకు రాలేము” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
Follow Us