/rtv/media/media_files/2025/10/30/prabhas-fauzi-2025-10-30-07-58-53.jpg)
Prabhas Fauzi
Prabhas Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన “బాహుబలి: ది ఎపిక్” రీ-రిలీజ్‌కి భారీ అంచనాలు నెలకొన్నాయి, అదే సమయంలో ఆయన మరో పెద్ద సినిమా “ఫౌజీ” షూటింగ్‌లో తలమునకలై ఉన్నాడు. ఈ సినిమా సెట్లో ఒక చిన్న కానీ సరదా సంఘటన జరిగింది, అదేంటో ఆ సినిమాలో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) స్వయంగా షేర్ చేశాడు.
రాహుల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన లుక్‌లో ఉన్నాడు అంటే ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, కొత్త గెటప్‌తో ఉన్నందున, చాలామంది ఆయనను గుర్తు పట్టలేకపోతున్నారు. “ఫౌజీ” సినిమాలో కూడా ఆయన ఇలాగే పెద్ద ఏజ్ పర్సన్ లాగ సీరియస్ లుక్‌లో నటిస్తున్నాడు.
Rahul Ravindran Full Interview
— Telugu360 (@Telugu360) October 28, 2025
Click Here : 👇https://t.co/oXmnbYnXRB
ప్రభాస్ నన్ను గుర్తు పట్టలేదు
ఎవరు ఈయన అని హను ని అడిగారు.
ఆ తరవాత నాకు పది సార్లు నాకు సారీ చెప్పారు. pic.twitter.com/fhPk3TmVds
‘సారీ రా! గుర్తు పట్టలేకపోయా’
అయితే, రాహుల్ మాట్లాడుతూ “ఒక రోజు షూటింగ్ సెట్‌లో నేను, ప్రభాస్ ఎదురుపడ్డాం. నేను ఆయనకు ‘నమస్తే’ చెప్పాను. ఆయన కూడా ‘హలో’ అన్నారు. తర్వాత ఆయన డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి ‘ఆ యాక్టర్ ఎవరు?’ ఎక్కడో చూసినట్టు ఉంది అని అడిగారు. అప్పుడు హను గారు ‘అతనే రాహుల్ రవీంద్రన్ నా మొదటి సినిమా అందాల రాక్షసి సినిమాలో హీరో’ అని చెప్పారు. వెంటనే ప్రభాస్ నా దగ్గరకు వచ్చి ‘సారీ రా! గుర్తు పట్టలేకపోయా’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఆ తర్వాత మేమిద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం” అని రాహుల్ తెలిపారు.
రాహుల్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కూడా చెప్పారు “ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ వ్యక్తి. బయట ఆయన సైలెంట్‌గా ఉంటాడని అనుకుంటారు, కానీ సెట్‌లో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాడు. ఎవరిని అయినా నవ్వుతూ పలకరిస్తాడు, సరదాగా జోకులు వేస్తాడు. అందరితో చాలా జోవియల్‌గా కలిసిపోతాడు” అని రాహుల్ అన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం “ఫౌజీ”తో పాటు కల్కి 2898 AD సీక్వెల్, రాజాసాబ్, మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రతి సినిమా పట్ల ఆయన చూపిస్తున్న అంకితభావం, సాధారణత ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
“ఫౌజీ” సినిమా యాక్షన్, ఎమోషన్ కలిపిన విభిన్న కథతో వస్తుందని సమాచారం. ప్రభాస్ లుక్, కొత్త స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెట్‌లో జరిగిన ఈ చిన్న సంఘటన అభిమానులను చిరునవ్వు తెప్పించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా, ఆయన వినయం మాత్రం ఎప్పటికీ మారదని మళ్లీ ఒకసారి ప్రూవ్ అయ్యింది.
Follow Us