ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1995లో పెళ్లి చేసుకున్న ఈ జంట 29 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ పదమూడేళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట గుడ్ బై చెప్పేసింది.
నిజానికి వీరిద్దరూ 2020లోనే విడిపోయారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. దాదాపు ఏడాది తరువాత సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు. 2020 నవంబర్ లో మోనికా రిచర్డ్ తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నామని తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు.
2013లో ప్రకాష్, సైంధవిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కూతురు అన్వీ కూడా ఉంది. మానసిక ప్రశాంతతో పాటు ఇద్దరి మెరుగైన జీవితం కోసం విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు
యువన్ శంకర్ రాజా గతంలో మొదట సుజన్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన కొద్ది రోజులకే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్ళాడాడు.
అయితే ఆమెతో కూడా విభేదాలు రావడంతో యువన్ శంకర్ రాజా విడాకుల కోసం ప్రయత్నించాడు. అయితే ఆమె విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతి కష్టమ్మీద విడాకులు పొందాడు. 2015 లో మలేసియాలో స్థిరపడిన ఫ్యాషన్ డిజైనర్ జఫరున్నీసాను మూడో పెళ్లి చేసుకున్నాడు.