PVCU Mahakali: 'మహాకాళి' గా భూమి శెట్టి.. భయపెడుతున్న ఫస్ట్ లుక్!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో 'మహాకాళి' ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ షేర్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

New Update
mahakali first look

mahakali first look

Mahakali:  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో 'మహాకాళి'  ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ షేర్ చేశారు  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సినిమా టైటిల్ రోల్ అయినా 'మహా'  పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.  'మహా' పాత్రలో  యంగ్ టాలెంట్ భూమి శెట్టి నటిస్తున్నట్లు ప్రకటించారు.  పోస్టర్ లో భూమి శెట్టి  లుక్ శక్తివంతమైన దేవత రూపాన్ని పోలి ఉంది.   "సృష్టి గర్భం నుంచి మేల్కొంటున్నాడు విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్‌ హీరో – మహాకాళి" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ ను విడుదల చేశారు. 

మొదటి లేడీ సూపర్ హీరో చిత్రం 

హనుమాన్ తర్వాత ప్రశాంత వర్మ PVCU నుంచి వస్తున్న మొదటి మహిళా సూపర్ హీరో చిత్రమిది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.  ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.   పురాణ  కథాంశంతో  బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ కథ  కాళీమాత స్వరూపం గురించి ఉంటుంది.  ఈ చిత్రం భారతీయ మహిళల సాధికారిత, విశ్వాసం, ధైర్యాన్ని సూచిస్తుందని నిర్మాతలు తెలిపారు. 

ఐమాక్స్ 3డీ  ఫార్మాట్‌

ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా  'అసురగురు శుక్రాచార్యుడి'  పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే  శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రాచార్యుడి గెటప్ లో అక్షయ్ కన్నా  చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సూపర్ హీరో చిత్రాన్ని  అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఐమాక్స్ 3డీ  ఫార్మాట్‌లో విడుదల కానుంది.

Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!

Advertisment
తాజా కథనాలు