Pushpa The Epic: "పుష్ఫ ది ఎపిక్‌" కమింగ్ సూన్.. ఇదెక్కడి క్రేజ్‌ రా మావా

గత కొన్ని ఏళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్‌ పాపులర్‌ అయింది. రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'ను కొత్త కాన్సెప్ట్‌తో, రెండు పార్ట్స్‌ కలిపి థియేటర్లలో రిలీజ్ చేసారు. అదే తరహాలో పుష్ప 1,2 పార్ట్స్‌ కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

New Update
Pushpa The Epic

Pushpa The Epic

Pushpa The Epic: గత కొన్ని ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్. పాత హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్‌కి పండుగలా మారింది. “మురారి”, “జల్సా”, “ఖుషి”, “మగధీర”, “దూకుడు”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” వంటి సినిమాలు రీ రిలీజ్‌ అయ్యి హౌస్‌ఫుల్‌ బోర్డ్స్‌ చూపించాయి.

ఈ ఫ్యాన్ ఫీవర్‌ను గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్‌ అవుతుండగా, ఇప్పుడు రెండు పార్ట్స్‌ని ఒకేసారి చూపించాలనే కొత్త ఐడియా తీసుకొచ్చారు. ఈ కొత్త కాన్సెప్ట్‌ను ఎస్‌.ఎస్‌. రాజమౌళి “బాహుబలి ది ఎపిక్” ద్వారా ప్రారంభించాడు.

2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా “బాహుబలి ది ఎపిక్” మళ్లీ థియేటర్లలోకి వచింది. అయితే ఇది పాత సినిమా కాదు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వడానికి రీ డిజైన్‌ చేసిన వెర్షన్. “ఎక్స్‌పీరియెన్స్ ది ఎపిక్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

రాజమౌళి ఎప్పుడూ కొత్త పంథాను చూపించే దర్శకుడు. “బాహుబలి” భారత సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చింది. ఇప్పుడు అదే సినిమాతో రీ రిలీజ్ కాన్సెప్ట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చాడు.

అయితే “పుష్ప ది రైజ్”,  “పుష్ప ది రూల్” సినిమాలను కలిపి ఒకే సినిమా రూపంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది?” అని ఆలోచిస్తున్నారంట మేకర్స్. “బాహుబలి ది ఎపిక్” హిట్ కావడంతో ఖచ్చితంగా “పుష్ప 1 & 2” కూడా ఇలాగే చూడాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే “పుష్ప 3”, “అల్లూ అర్జున్ – అట్లీ” సినిమా రిలీజ్‌కి ఇంకా టైమ్ ఉంది.

ఇదే కాకుండా, మణిరత్నం తెరకెక్కించిన “పొన్నియన్ సెల్వన్” 1 & 2 భాగాలను కలిపి ఒకే సినిమాలో చూపించాలనే ఆలోచన కూడా కొలీవుడ్‌లో చర్చనీయాంశంగా ఉంది.

మొత్తానికి, “బాహుబలి ది ఎపిక్” రీ రిలీజ్ కేవలం సినిమా రివిజిట్ కాదు  భారత సినిమా భవిష్యత్తుకి కొత్త బ్లూప్రింట్. ఇది విజయవంతమైతే, త్వరలో “KGF”, “RRR” వంటి ఎపిక్ సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వొచ్చు.

Advertisment
తాజా కథనాలు