హైదరాబాద్ RTC X రోడ్స్ లోని సంధ్య 70 MM థియేటర్ పై కేసు నమోదైంది. నిన్న రాత్రి 'పుష్ప2' ప్రీమియర్ షో నిర్వహించడంతో.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ ఫ్యామిలీ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే వైద్యులు సీపీఆర్ అందించిన ఫలితం లేకపోయింది. తల్లి మృతి చెందగా.. కొడుకు, కూతురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు సంధ్య థియేటర్స్ యాజమాన్యం పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ యాజమాన్యం కేసు నమోదు చేశారు.