/rtv/media/media_files/2025/10/08/rajvir-jawanda-2025-10-08-15-25-08.jpg)
Rajvir Jawanda
Singer Death: పంజాబీ పాపులర్ సింగర్ రాజ్‌వీర్ జవాండా మృతి చెందారు. సెప్టెంబర్ 27న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రాజ్‌వీర్ గత 11 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ.. ఈరోజు తుది శ్వాస విడిచారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని బడ్డీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రాజ్‌విర్ తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. క్రిటికల్ కేర్, న్యూరోసైన్సెస్ వైద్య బృందాలు ఆయనను దగ్గరగా పర్యవేక్షించాయి. కానీ, లాభం లేకపోయింది! పరిస్థితి మరింత తీవ్రం కావడంతో రాజ్‌విర్ కన్నుమూశారు. రాజ్‌వీర్ అకాల మరణం ఆయన అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
This has made my heart go Empty Waking up to this terrible news is unbearable.
— Gippy Grewal (@GippyGrewal) October 8, 2025
My brother Rajvir, your last days were so difficult you showed such strength.
You will forever remain in our hearts, memories, and souls. 🙏🏻 #RajvirJawandapic.twitter.com/T9CNgNdrHY
ముఖ్యమంత్రి పరామర్శ
రాజ్‌విర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పంజాబీ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పంజాబీ సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు రాజ్‌విర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సింగర్ రాజ్‌విర్ జవాందా లుథియానాలోని జాగ్రాన్‌లోని పోనా గ్రామంలో పుట్టిపెరిగారు. చిన్నతనం నుంచి సంగీతం పై ఉన్న ఆసక్తి, ఇష్టంతో సింగర్ గా ఎదిగారు. పంజాబీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జవాందా పాడిన ''Tu Dis Penda,” “Khush Reha Kar,” “Sardari,” “Kangani” వంటి పాటలు ఫుల్ పాపులర్ అయ్యాయి. గాయకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా సత్తాచాటారు సింగర్ జవాందా! 'సుబేదార్ జోగిందర్ సింగ్', 'జింద్ జాన్', 'మిండో తసీల్‌దార్నీ' వంటి పంజాబీ సినిమాల్లో నటుడిగా అలరించారు.