OG Movie: ఇప్పుడు 'మిరాయ్' ప్లేస్ లో 'ఓజీ'.. నిర్మాత నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'ఓజీ' ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరో 24 గంటల్లో అభిమానుల ఎదురుచూపులకు తెర పడనుంది.

New Update
OG Movie

OG Movie

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'ఓజీ' ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరో 24 గంటల్లో అభిమానుల ఎదురుచూపులకు తెర పడనుంది. సెప్టెంబర్ 25న 'ఓజీ'  ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చాలా చోట్లు థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఈ క్రమంలో  'మిరాయ్' మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్  'ఓజీ' కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 

'మిరాయ్' ప్లేస్ లో 'ఓజీ ' 

సెప్టెంబర్ 25న 'మిరాయ్' ప్రదర్శితమవుతున్న కొన్ని థియేటర్స్ లో 'ఓజీ'  ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 26 నుంచి యధావిధిగా ఆయా థియేటర్స్ లో  'మిరాయ్' సినిమానే స్క్రీనింగ్ చేయనున్నారు. ఈనెల సెప్టెంబర్ 25న విడుదలైన  'మిరాయ్' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న చాలా థియేటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాత  విశ్వప్రసాద్  'మిరాయ్'  థియేటర్లను 'ఓజీ' కి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంపై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 'ఓజీ' ప్రీమియర్ షోలు మొదలవుతాయి. సినిమా ప్రమోషనల్ కంటెంట్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత పవర్ స్టార్ సినిమాలకెప్పుడూ లేని విధంగా 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. విడుదలకు నాలుగు రోజుల ముందు నుంచే హైదరాబాద్ లోని పలు థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టాయి. ఆ రేంజ్ లో ఓజీ క్రేజ్ ఉంది. కేవలం ప్రీ సేల్ బిజినెస్ ద్వారానే రూ. 75 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఓజీ తొలి రోజు రూ. 100 కోట్లు సాధించవచ్చని సినీ విశ్లేషకుల అంచనా. ఇలా జరిగితే పవర్ స్టార్ కేరెర్ లో ఇదొక బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతుంది. 

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాన్ ఒక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్ స్టార్ డ్రామగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ ఓజస్ గంభీర పాత్రలో నటించారు. ఇందులో ప్రియాంక్ మోహన్ హీరోయిన్ గా, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటించారు. 

ఓజీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లను వేలం పాడుతున్నారు. వీటిని దక్కించుకోవడానికి కొంత మంది హార్ట్ కోర్ ఫ్యాన్స్ లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఏపీలో ఓ అభిమాని 1.25 లక్షలు పెట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కొనుక్కున్నాడు. ప్రభాస్ సాహో డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Also Read: OG Premiere Show: మీరు కదా అసలైన 'OG'లు.. నార్త్ అమెరికా ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే..!

Advertisment
తాజా కథనాలు