లేడీ సూపర్ స్టార్ అని చెప్పగానే వినిపించే పేరు నయనతార. వయసు పెరిగినా అందంలో ఎక్కడా తగ్గడం లేదు. కుర్ర హీరోయిన్లతో సహా దూసుకుపోతుంది. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా నయనతార తీరుపై ఓ నిర్మాత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆమె తీరు వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు మరో నిర్మాత విమర్శలు చేశారు.
నయనతార సినిమా చేస్తుంది కానీ ప్రమోషనల్ ఈవెంట్లకు రాదని అన్నారు. ఇదే గాక వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయని అన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత కమ్ యూట్యూబర్ అంతనన్ ఆమెపై పలు విమర్శలు చేశాడు. తన పిల్లలని చూసేందుకు ఇద్దరు ఆయాలను సైతం సెట్స్ కు తీసుకొస్తుందని.. వారి ఖర్చు కూడా నిర్మాతలే భరించాలని ఒత్తిడి చేస్తుందని ఆరోపించాడు.
ఆమె పిల్లల నానీలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదని.. ఆమె తన వ్యక్తిగత విషయాలపై డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోందని అన్నారు.
అంతేకాకుండా ఆమె తన పెళ్లిని కూడా నెట్ ఫ్లిక్స్ కు భారీ మొత్తానికి అమ్మేసిందని అన్నారు. ఆమె ప్రతీది తన వ్యాపరంగా మార్చుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.