ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి 2'. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను 'ఆహ' తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. By Archana 25 Sep 2024 in సినిమా Short News New Update Prathinidhi 2 షేర్ చేయండి Prathinidhi 2: నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి2'. 2014లో వచ్చిన 'ప్రతినిధి' సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. పాత్రికేయుడు మూర్తి దేవప్తపు దర్శకత్వం వహించిన ఈ మూవీని రా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రతినిధి 2 ఓటీటీ రిలీజ్ తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ఈ నెల 27నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఆహా' తమ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. 'ప్రశ్నించేందుకు ప్రతినిధి వస్తున్నాడు' అంటూ ఓటీటీ డేట్ అనౌన్స్ చేసింది. ప్రతినిధి 2 స్టోరీ సినిమాలో చేతన్(నారా రోహిత్) నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రను పోషించాడు. అయితే హీరో చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలే ఆయన జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఈ క్రమంలో చేతన్ ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా తన వృత్తిని మొదలు పెడతాడు. అలా చేతన్ జీవితం కొనసాగుతుండగా ఊహించని విధంగా ఎన్.ఎన్.సి అనే ఓ పెద్ద న్యూస్ ఛానెల్ అతన్ని కంపెనీ CEO గా నియమిస్తుంది. ఆ తర్వాత చేతన్ తన చాకచక్యంతో ఎంతో మంది రాజకీయ నాయకుల అన్యాయాలు, అక్రమాలను బట్టబయలు చేస్తాడు. ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్‌కర్) పై హత్య ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ హత్య ప్రయత్నం వెనుక ఉన్నది ఎవరు..? జర్నలిస్ట్ చేతన్ దీని వెనుక ఉన్న నిజాలను ఎలా బయటకు తీసుకొచ్చాడు? అనేది సినిమా కథ. మార్పు కోసం మరో యుద్ధం!✊🏻ప్రతినిధి-2 వస్తున్నాడు!!👨🏻💻#Prathinidhi2 Premieres 27th September on aha!@IamRohithNara @murthyscribe @VanaraEnts @SagarMahati @kumarraja423 @TSAnjaneyulu1 #aha pic.twitter.com/GbikZllHGF — ahavideoin (@ahavideoIN) September 24, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి