Prakash Raj: చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం ఏంటో..! పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హీరో కార్తీ క్షమాపణలు చెప్పడం పై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో!'' జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ వెటకారంగా ట్వీట్ చేశారు.

New Update
Prakash Raj:  దయచేసి క్షమించు.. నటుడు ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ ట్వీట్..!!

Prakash Raj

Prakash Raj:  ఇటీవలే జరిగిన 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ లడ్డూ  గురించి మాట్లాడుతూ.. అది సెన్సిటివ్ ఇష్యూ .. ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అని ఫన్నీగా  మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. "తిరుమల శ్రీవారి లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ  అనడం తప్పు.. అతను చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి అంటూ హీరో కార్తీ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు". దీని పై హీరో కార్తీ స్పందిస్తూ.. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని కోరారు.

పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ 

అయితే తాజాగా నటుడు ప్రకాష్ రాజ్.. కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పడం పై సంచలన పోస్ట్ పెట్టారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో!'' జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ వెటకారంగా ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉంటే లడ్డూ విషయంలో  పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన  వ్యాఖ్యలకు పవన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జరిగింది తెలుసుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు. దీనిపై మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. లడ్డూ వివాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అర్థం కాకపోతే మరొకసారి తన ట్వీట్ చదువుకోండి అంటూ  పవన్ కు కౌంటర్ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు