/rtv/media/media_files/2026/02/10/prabhas-spirit-2026-02-10-07-07-32.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) తప్పుకున్నారన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. దీనిపై తాజాగా ప్రకాశ్‌రాజ్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.
సందీప్ రెడ్డి వంగాతో క్రియేటివ్ భేదాల కారణంగా తాను సినిమా నుంచి బయటకు వచ్చేశానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘స్పిరిట్’ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటివరకు మొదలుకాలేదు. అలాంటప్పుడు సినిమా నుంచి నేను తప్పుకున్నానని ఎలా చెబుతారు? వాట్సప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథలు తయారు చేస్తున్నారు. బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి” అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.
Prakash Raj on Spirit Rumours
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026
ఇటీవల ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనంలో, దర్శకుడితో అభిప్రాయ భేదాల కారణంగా ప్రకాశ్‌రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పేర్కొన్నారు. అయితే ఆ కథనాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. “ఇలాంటి అర్థం లేని ఊహాగానాల గురించి నాకు ఏమాత్రం తెలియదు” అని స్పష్టంగా చెప్పారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రభాస్‌తో పాటు ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి సినిమా వివరాలను మేకర్స్ ఇంకా రహస్యంగానే ఉంచుతున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో ఈ సినిమాలో దీపికా పదుకొణె నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే క్రియేటివ్, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రి ఈ సినిమాలో చేరింది. త్రిప్తి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో ‘యానిమల్’ సినిమాలో కలిసి పనిచేశారు.
మొత్తానికి, ప్రకాశ్‌రాజ్ స్వయంగా ఇచ్చిన స్పష్టతతో ఆయన ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారన్న వార్తలకు ప్రస్తుతం ఫుల్‌స్టాప్ పడింది. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే కొద్దీ మరిన్ని అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
Follow Us