Dude OTT Date: ‘డ్యూడ్’ వచ్చేస్తున్నాడు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ స్పెషల్ డే నుండి స్ట్రీమింగ్..!

‘డ్యూడ్’ సినిమా తాజాగా విడుదలై మంచి థియేట్రికల్‌గా హిట్ గా నిలిచింది. ప్రదీప్ రంగనాథన్, మమితా, నేహా నటన, సాయి అభ్యంకర్ సంగీతం హైలైట్ అయ్యాయి. నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

New Update
Dude Collections

Dude OTT Date

Dude OTT Date: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా Keerthiswaran తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ సినిమా ‘డ్యూడ్’ థియేటర్స్‌లో భారీ హిట్ అందుకుంది. యూత్‌ఫుల్‌ కథ, ఎమోషనల్‌ టచ్‌, కామెడీ సీన్‌లు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ప్రదీప్ ఎనర్జీ, మమితా బైజు, నేహా శెట్టి నటన ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం, సాయి అభ్యంకర్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

100 కోట్ల గ్రాస్‌ హిట్ Dude Movie Collections

సినిమా థియేట్రికల్‌ రన్‌లో 100 కోట్ల గ్రాస్‌ హిట్ సాధించగా, ఇండియాలో 68.09 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లు వసూలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ప్రేక్షకులు ఇప్పుడు ‘డ్యూడ్’ ని డిజిటల్‌ వేదికపై చూడడానికి ఎదురుచూస్తున్నారు. తాజా వార్తల ప్రకారం, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మరికొన్ని భాషలలో కూడా విడుదల కావచ్చని రిపోర్ట్‌లు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

సినిమా ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో “డ్యూడ్ ఓటీటీ ఎప్పుడు?” అంటూ వేచి చూస్తున్నా. సినిమాకు సాయి అభ్యంకర్ అందించిన పాటలు యూత్ ప్లేలిస్టుల్లో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, ప్రదీప్-మమితా-నేహా కాంబినేషన్, కామెడీ-ఎమోషనల్‌ సీన్‌లు కలిపి ఈ మూవీని మంచి యూత్ హిట్‌గా నిలిపాయి.

ప్రదీప్ రంగనాథన్ సోషల్‌ మీడియాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “Dudeకి అందించిన ప్రేమకు అందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఇలా, థియేట్రికల్‌ విజయాన్ని అందుకున్న ‘డ్యూడ్’ ఇప్పుడు ఓటీటీ వేదికపై, మరింత మంది ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్ళీ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Advertisment
తాజా కథనాలు