/rtv/media/media_files/2026/02/17/prabhas-2026-02-17-09-15-34.jpg)
Prabhas
Prabhas: ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, తన నటనతో, స్టైల్‌తో కోట్లాది అభిమానులను గెలిచాడు. అయితే, వ్యక్తిగత జీవితంలో ప్రభాస్ చాలా సింపుల్, రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే, ప్రభాస్ మాత్రం భిన్నంగా ఉంటారు.
#Prabhas అసలు సోషల్ మీడియాలో ఏం జరుదగుతుందో తెలియదు. సోషల్ మీడియా వదిలేయాలను చెప్తుంటాడు.
— Subbu kilari (PRO) (@ProSubbarao) February 17, 2026
His Team Handles Social Media & It's mainly for Promotions - #PoojaHegde
pic.twitter.com/CDkeDb1afM
‘రాధే శ్యామ్’ సినిమాలో జత కట్టిన పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. టెక్నాలజీపై అతనికి ఎక్కువ అవగాహన ఉండదు. అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ప్రభాస్ స్వయంగా నిర్వహించరు, వాటిని ఒక డిజిటల్ టీమ్ మాత్రమే చూసుకుంటుంది. ఈ అకౌంట్స్‌లో ప్రధానంగా సినిమాల ప్రమోషన్, కొత్త చిత్రాల అప్‌డేట్స్, వృత్తిపరమైన ప్రకటనలు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత ఫొటోలు లేదా వీడియోలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.
ఇక సినిమా లైన్‌అప్ విషయానికి వస్తే, ప్రభాస్ ‘ఫౌజీ’ తర్వాత ‘స్పిరిట్’ చిత్రంలో కనిపించనున్నారు. ఇది పోలీస్ యాక్షన్ డ్రామా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తూ, టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 మార్చి 5న రిలీజ్ కానుంది.
అలాగే ప్రభాస్ సలార్ 2, కల్కి 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్స్ వల్ల ప్రభాస్ క్రేజ్ మరింత పెరగనుంది,
Follow Us