Prabhas Movie: ఒక్క సీన్‌కే కోట్లు పెట్టారు..! కానీ ఏమైందో తెలుసా?

స్టార్ హీరో ప్రభాస్ ఐదేళ్ళ క్రితం నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ 'సాహో'. అయితే ఈ సినిమాలో 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మేకర్స్ 70 కోట్లు ఖర్చు చేశారట. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క సీన్‌కు ఖర్చు చేసిన అత్యధిక బడ్జెట్ ఇదే.

author-image
By Archana
New Update
prabhas

Saaho Movie: 'బాహుబలి' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత.. ఐదేళ్ళ క్రితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ కథానాయికగా నటించగా.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, చుంకీ పాండే, మందిరా బేడీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందింది. ఈ సినిమా చిత్రీకరణ విషయంలోనూ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రపంచంలోని హై ఎండ్ టెక్నీషియన్స్ తో రూ. 300 వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించారు. IMAX కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ప్రభాస్ అభిమానులను భారీగా నిరుత్సాహపరిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. 

ఒక్క సీన్‌కే కోట్లు 70 కోట్లు

అయితే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించిన మరో విశేషమేంటంటే.. ఈ మూవీ కేవలం ఒక్క సీన్‌కే కోట్లు చేశారట. 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారట. ప్రపంచ నలుమూలల నుంచి 100 మంది ఫైటర్లను నియమించారట. ఇండియన్ సినిమా చరిత్రంలో ఒక్క సీన్ కోసం ఖర్చు చేసిన అత్యధిక బడ్జెట్ కూడా ఇదేనట. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ప్రకారం సాహో ప్రపంచావ్యాప్తంగా రూ.451 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పూర్తిగా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 

'కల్కి 2898AD'

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇటీవలే నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898AD' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది 2024 లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి' సీక్వెల్ 'కల్కి 2' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Advertisment
తాజా కథనాలు