/rtv/media/media_files/2025/12/17/rajasaab-2025-12-17-17-44-33.jpg)
Rajasaab
Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తాజా చిత్రం ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండ్ అవుతోంది, రెండో పాట ‘సహనా సహనా’ ప్రోమో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను ప్రత్యేకంగా ప్రోమోట్ చేయడానికి చిత్రబృందం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈరోజు 6 గంటలకు ఈ ఈవెంట్ లైవ్ స్టార్ట్ కానుంది. ఫుల్ సాంగ్ ని 6.35ని లకు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మూవీ టీమ్ తెలిపింది. దింతో ఈవెంట్‌లో ఫ్యాన్స్ సందడి చేయడం ఖాయం, అందులో మూవీ టీమ్ పాల్గొని ప్రేక్షకులతో ముఖాముఖి కలవనున్నారు.
All set ❤️🔥❤️🔥❤️🔥#SahanaSahana launch event begins shortly!! 💥💥💥#Prabhas#TheRajaSaabpic.twitter.com/4Cvy5uppQk
— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025
Rajasaab Sahana Sahana Song Launch
Raja Saab.. Rani saab..🕺💃💥💥💥 pic.twitter.com/6eqNC5LPhb
— ᴠɪꜱʜᴀʟ (@vishal_x_x_7) December 17, 2025
‘రాజాసాబ్’ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న సినిమా. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, సినిమా పలు కారణాల వల్ల కొన్ని సార్లు వాయిదా పడడం వంటి కారణాలతో ఫ్యాన్స్ అంచనాలు కొంతమేర తగ్గాయి. అయితే ప్రస్తుతం ఫ్యాన్స్ దృష్టంతా ఈ సెకండ్ సాంగ్ మీదే ఉంది. మరి కాసేపట్లో విడుదల కానున్న ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Follow Us