/rtv/media/media_files/2026/01/04/rajasaab-nache-nache-2026-01-04-08-48-18.jpg)
Rajasaab Nache Nache
Rajasaab Nache Nache: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న కొత్త సినిమా ‘ది రాజా సాబ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ డ్రామాగా రూపొందుతోంది. ప్రభాస్‌ను అభిమానులు ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారో, అలా ఈ సినిమాలో చూపించబోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి రెస్పాన్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘రెబల్ సాబ్’, ‘సహానా సహానా’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నాచే నాచే’ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో విడుదలైన వెంటనే ప్రభాస్ అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది.
‘నాచే నాచే’ పాట బాలీవుడ్‌లో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాలోని పాపులర్ సాంగ్‌కు రీమిక్స్‌గా రూపొందించారు. ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్ కొత్త ట్యూన్ ఇచ్చారు. పాత పాట ఫీల్ ఉండేలా, కొత్త తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సాంగ్‌ను తయారు చేశారు. ప్రోమోలో ప్రభాస్ డ్యాన్స్ స్టెప్పులు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Dear Darlings,
— The RajaSaab (@rajasaabmovie) January 3, 2026
This is our promise to you…#NacheNache will see #Prabhas bring the HIGH with his moves this Sankranthi 🔥
It will be an eye feast.#NacheNache#TheRajaSaab@MusicThamanpic.twitter.com/KWG8KMpsbn
ఈ పాటలో ప్రభాస్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు కలిసి కనిపించనున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేయనున్నారు. కలర్‌ఫుల్ సెట్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, ఎనర్జీతో కూడిన డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రోమో చూస్తేనే పాటపై అంచనాలు పెరిగేలా ఉంది.
చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ సాంగ్ చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాల్లో ఈ తరహా డ్యాన్స్ నంబర్లు తక్కువగా ఉండటంతో, ‘నాచే నాచే’ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ పాట సినిమా మొత్తానికి మంచి ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా విజువల్స్ పరంగా కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు సమాచారం. హారర్, కామెడీ, రొమాన్స్, డ్యాన్స్ అన్నీ కలిపి ప్రభాస్‌ను కొత్తగా చూపించేందుకు దర్శకుడు మారుతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ‘నాచే నాచే’ సాంగ్ ప్రోమోతో ‘ది రాజా సాబ్’ సినిమాపై హైప్ మరింత పెరిగింది. పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
Follow Us