Raja Saab OTT: ఆ రోజే ప్రభాస్ 'ది రాజాసాబ్' OTT ఎంట్రీ!

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మార్చి 26, 2026 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది.

New Update
Raja Saab OTT

Raja Saab OTT

Raja Saab OTT: ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ థియేటర్లలో పూర్తి రన్ ముంగించుకోనుంది. మంచి ప్రీ-రిలీజ్ హైప్ ఉన్నప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

తెలుగు, హిందీ మార్కెట్లలోనూ సినిమాకు సరైన స్పందన దక్కలేదు. కథ, కథనం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోవడం, నెగటివ్ టాక్ రావడం వల్ల సినిమా నెమ్మదిగా వెనుకబడింది. దీంతో ఈ సీజన్‌లో నిరాశ కలిగించిన సినిమాల జాబితాలో ‘ది రాజా సాబ్’ చేరింది.

థియేటర్ల రన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపై పడింది. థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా డిజిటల్‌లో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జియో హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్లు, హారర్ మిశ్రమంగా రూపొందింది. ప్రభాస్ ఈ సినిమాలో కొత్తగా, మాస్ ఎంటర్‌టైనర్ తరహా పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి 26, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో ఆదరణ తగ్గిన ఈ చిత్రం, ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ పొందుతుందేమో చూడాలి.

Advertisment
తాజా కథనాలు