New Update
/rtv/media/media_files/2026/01/12/raja-saab-collections-2026-01-12-14-59-30.jpg)
Raja Saab Collections
Raja Saab Collections: ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ మార్చేసిన ప్రభాస్(Prabhas). ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే భావన జనాల్లో ఏర్పడింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే భారీ బడ్జెట్ అవసరం. కనీసం రూ. 500 కోట్లకు తగ్గకుండా నిర్మాతలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభాస్ ఒక్క సినిమాకు తీసుకునే పారితోషికం కూడా రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
A festival treat turned BOX OFFICE CARNAGE ❤️🔥❤️🔥#TheRajaSaab crosses 183+ Crores Worldwide Gross in just 3 days 🔥🔥
— The RajaSaab (@rajasaabmovie) January 12, 2026
&
Gears up for the Sankranthi festive week with massive audience love ❤️❤️#BlockbusterTheRajaSaab#Prabhas@directormaruthi@musicthaman@peoplemediafcy… pic.twitter.com/0xc9p2UejV
ప్రభాస్ సినిమా విడుదల అవుతుందంటే చాలు, ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా థియేటర్లకు పరుగులు పెడతారు. అలాంటి స్టార్ ఈసారి ‘ది రాజాసాబ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డార్లింగ్ వింటేజ్ స్టైల్‌తో పాటు కొత్త అనుభూతిని ఇచ్చేలా రూపొందింది.
దర్శకుడు మారుతి ఈ సినిమాను సోషియో ఫాంటసీ డ్రామాగా తీర్చిదిద్దారు. మైండ్ గేమ్ అంశాలతో కథను నడిపించారు. ప్రభాస్ ఇందులో కొత్త తరహా పాత్రలో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో మంచి సందడి కనిపిస్తోంది.
నైజాం ప్రీమియర్స్ ఆలస్యం అవ్వడం లాంటి సమస్యలు ఉన్నా, ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ దగ్గర బలమైన ప్రారంభం సాధించింది. సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రభాస్ కెరీర్‌లో వంద కోట్లకు పైగా ఓపెనింగ్ వచ్చిన ఆరో సినిమాగా ‘రాజాసాబ్’ రికార్డు సృష్టించింది.
సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 183 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు వరుసగా సెలవులు ఉండటంతో థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ రోజు ముగిసేలోపు సినిమా రూ. 200 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. అలాగే ప్రభాస్ అభిమానులు కూడా పండుగ వాతావరణంలో సినిమాను చూసేందుకు భారీగా థియేటర్లకు వెళ్తున్నారు.
మొత్తానికి, కొత్త జానర్‌లో ప్రభాస్ చేసిన ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇస్తోంది. ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ సంక్రాంతి రేసులో దూసుకుపోతోంది.
తాజా కథనాలు
Follow Us