/rtv/media/media_files/2026/01/31/prabhas-fauzi-2026-01-31-16-06-50.jpg)
Prabhas Fauzi
Prabhas Fauzi: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ సినిమాకు ప్రెజెంటర్స్‌గా ఉన్నారు. నిర్మాతలుగా నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ వ్యవహరిస్తున్నారు.
The man…
— Fauzi (@FauziTheMovie) October 24, 2025
The mission…
The mystery…#Prabhas is #Fauzi ❤️🔥
The mission has just begun… and the fire has been lit. 🔥🔥#Imanvi@hanurpudi#MithunChakraborty#JayaPrada@AnupamPKher@Composer_Vishal@sudeepdop@kk_lyricist@MrSheetalsharma@rckamalakannan… pic.twitter.com/g2OEkrYR46
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపుతో చిత్రబృందం ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పండుగ సీజన్‌లో ఇది పెద్ద ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. మధ్యలో పెద్ద గ్యాప్‌లు లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో, మంచి క్వాలిటీ విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా సినిమా ఉండనుందని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూపించనున్నారని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. ప్రభాస్ లుక్, క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయనకు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. అలాగే అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉండనుంది. సినిమాటోగ్రఫీని సుదీప్ ఛటర్జీ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అనిల్ విలాస్ జాధవ్ పనిచేస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వర రావు చూసుకుంటున్నారు.
మొత్తానికి భారీ తారాగణం, అనుభవం ఉన్న దర్శకుడు, పెద్ద నిర్మాణ విలువలతో ‘ఫౌజీ’ ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రత్యేక సినిమాగా నిలవనుందని అభిమానులు నమ్ముతున్నారు.
Follow Us