Bahubali: 'బాహుబలి' మళ్ళీ రీరిలీజ్.. కానీ ఒక ట్విస్ట్!

 'బాహుబలి'  సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. పదేళ్లు గడిచిన ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే అదే  ఉత్సాహం, అదే ఆశ్చర్యం కలుగుతుంది.  

New Update

Bahubali:  ''కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు''?  ఈ ప్రశ్న దేశమంతా సంచలనం సృష్టించింది. టీవీ చర్చల్లో, ఇంటర్నెట్ ఫోరమ్స్‌లో, స్నేహితుల మధ్య... ఎక్కడ చూసినా ఇదే చర్చ! ఈ ప్రశ్నకు సమాధానం దొరికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. నేటితో  'బాహుబలి'  సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. 

బాహుబలికి పదేళ్లు

పదేళ్లు గడిచిన ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సినిమా చూస్తే అదే  ఉత్సాహం, అదే ఆశ్చర్యం కలుగుతుంది.  ఇది కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు..  భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం లిఖించింది.  సినిమాలోని భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన గ్రాఫిక్స్ కళ్ళను ఆశ్చర్యపరిచాయి. మునెప్పన్నడూ ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ట్రీట్ అందించింది బాహుబలి!  తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చూపింది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో కూడా  ఈ సినిమాకు అభిమానులు తయారయ్యారు.  ఇందులోని  బాహుబలి, భల్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ ఇలా ప్రతీ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్

ఈ  అద్భుత ళాఖండానికి పదేళ్లు నిండిన సందర్భంగా చిత్ర బృందం సెలెబ్రేషన్స్ జరుపుకుంది.   డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్, రానా ఇతర నటీనటులు ఎక్స్ వేదికగా సినిమా అందించిన మధురానుభూతులను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.  'బాహుబలి' ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రెండు భాగాలుగా అలరించిన బాహబలిని   'బాహుబలి: ది ఎపిక్' అనే పేరుతో ఒకే సినిమాగా రీరిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.

Also Read: Bahubali: శివగామితో బాహుబలి, భల్లాలదేవ.. పదేళ్ల బాహుబలి ముచ్చట్లు! ఫొటోలు చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు