/rtv/media/media_files/2025/10/07/baahubali-3-2025-10-07-16-01-41.jpg)
Baahubali 3
Baahubali 3: భారతీయ సినిమా చరిత్రలో 'బాహుబలి' అనే పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ రెండూ సినిమాలు కలిపి ఒకే ఫార్మాట్లో వచ్చే కొత్త ఎడిషన్‌కి టైటిల్ ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు మేకర్స్.
ఈ స్పెషల్ ఎడిషన్‌ను అక్టోబర్ 31, 2025న భారీగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో కొత్త సీన్లు ఉన్నాయా? క్లైమాక్స్ ఏమైనా కొత్తగా ఉందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇదే సమయంలో “బాహుబలి 3కు హింట్ ఉందా?” అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ రూమర్స్‌పై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా పుకార్లే. బాహుబలి 3పై ఇంకా చాలా పని చేయాలి. కానీ ఈ స్పెషల్ ఎడిషన్‌లో చిన్న సర్ప్రైజ్ మాత్రం ఉంటుందేమో” అని చెప్పారు. ఇది విన్న అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
మరి ఈ రీ-ఎడిషన్‌ని మళ్లీ రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి? అనేది చాలా మందిలో సందేహం. దీనిపై శోభు మాట్లాడుతూ.. “ఇది కేవలం కలెక్షన్ల కోసం కాదు. ఇది ఒక సెలబ్రేషన్. బాహుబలి సినిమా విడుదలై దాదాపు పదేళ్లు అవుతోంది. అందుకే మళ్లీ థియేటర్లో పెద్దగా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్లాన్ చేశాం” అన్నారు.
ఇప్పటివరకు ఈ మూవీ రన్‌టైమ్‌పై క్లారిటీ రాలేదు. కానీ రెండు పార్టుల నుంచి ముఖ్యమైన సీన్లను మాత్రమే తీసుకుని ఈ స్పెషల్ వెర్షన్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై రానా దగ్గుబాటి మాట్లాడుతూ..
“ఏ సీన్లు ఉంచారు? ఏవి తీసేశారు? అన్నది రాజమౌళికే తెలుసు” అన్నారు. గతంలో కొన్ని సీన్లను, పాటలను తీసేయాలని రాజమౌళి కూడా చెప్పిన సందర్భం ఉంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అందులో ప్రభాస్, రానా, అనుష్కతో పాటు ఎస్.ఎస్. రాజమౌళి కూడా పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రీ-రిలీజ్ ద్వారా మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? క్లైమాక్స్‌లో ఏం సర్ప్రైజ్ ఉండబోతోంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ‘బాహుబలి 3’ వస్తుందా? లేక ఇంకొక కథతో కొత్త ప్రయాణం మొదలవుతుందా? అన్నది చూస్తేనే తెలుస్తుంది!
Follow Us