Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. శ్యామలా దేవి సంచలన ప్రకటన !

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బయట అమ్మయ్యా, సినిమా అమ్మాయా అనేది చెప్పను కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు.

New Update
Prabhas marriage

Prabhas marriage

Prabhas Marriage: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, డార్లింగ్  ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ పెళ్లి గురించి గత పదేళ్లుగా సినీ అభిమానుల్లో, మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఎంతలా అంటే ప్రతి సినిమా ఇంటర్వ్యూలో, ప్రమోషన్స్ లో  ప్రభాస్ పెళ్లి గురించి అడగడంఆనవాయితీ  అయిపోయింది. ఎన్ని సార్లు అడిగినా ప్రభాస్ నవ్వుతూ.. ఆ ప్రశ్నను దాటేయడం కూడా కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బయట అమ్మయ్యా, సినిమా అమ్మాయా అనేది తెలియదు కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

గతంలో కూడా శ్యామలా దేవి పలు సార్లు ప్రభాస్ పెళ్లి గురించి మీడియా ముందు మాట్లాడారు. . "ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. సరైన అమ్మాయి దొరికిన వెంటనే పెళ్లి చేస్తాం" అని చెప్పారు. ఒకానొక సందర్భంలో ప్రభాస్ పెళ్లి గురించి ఆయన సోదరుడు కూడా స్పందించారు. "ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు, కానీ సరైన సమయం కోసం చూస్తున్నాడు" అని అన్నారు.

పలు హీరోయిన్లతో రూమర్స్ 

ప్రభాస్ పెళ్ళికి  సంబంధించి అనేక రకాల రూమర్లు కూడా వైరల్ అయ్యాయి. పలు హీరోయిన్లతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్, హీరోయిన్ అనుష్క మధ్య ఏదో ఉందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కథనాలు  వచ్చాయి. ఆ తర్వాత కృతి సనన్ ని ప్రేమిస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలా సోషల్ మీడియా ప్రభాస్ కి చాలా సార్లు పెళ్లి చేసింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. 

సినిమాలతో బిజీ 

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నారు. 'కల్కి 2898 AD', 'రాజా సాబ్', 'ది రాజా డీలక్స్' వంటి పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్ వల్ల కూడా పెళ్లి గురించి ఆలోచించడానికి ఆయనకు సమయం దొరకడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే రోజు కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు ఎప్పుడు వస్తుందో, ఆ అదృష్టవంతురాలు ఎవరో అనేది కాలమే నిర్ణయించాలి. ఇదిలా ఉంటే ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ప్రభాస్ చాలా కామ్ గా,  సింపుల్ గా ఉంటారు. అందుకే ఆయనను అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. 

Advertisment
తాజా కథనాలు