Jani Master: ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్ పై విచారణ జరగనుంది. జానీ మాస్టర్‌ను 10 రోజుల కస్టడీకి న్యాయస్థానాన్ని పోలీసులు కోరనున్నారు. కస్టడీలో కీలక విషయాలను రాబడుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచనాలు విషయాలు బయటకు వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
2020లోనే అత్యాచారం..
2019లోనే బాధితురాలతో తనకు పరిచయం ఉందని జానీ మాస్టర్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో ఇలా... దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2020 జనవరి 20న ముంబైలోని హోటల్‌లో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి కొనసాగింది. విషయం బయటకు రావద్దని బాధితురాలికి బెదిరింపులు చేశాడు.
సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు చేసినట్లు ఒప్పుకున్నాడు. షూటింగ్‌ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్స్‌లో లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. కాగా బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం చేసినందుకు జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.
సినీపెద్దల వద్దకు జానీ భార్య...
జానీ మాస్టర్ భార్య అయేషా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ పెద్దలను కలిసి మద్దతు కూడగట్టాని సిద్ధమయ్యారు. రేపు డైరెక్టర్ సుకుమార్‌ను, డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడనున్నారు. తన భర్తపై కుట్ర చేసి కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. కాగా నిన్న జానీ మాస్టర్ బాధితురాలిని పలుమార్లు అత్యాచారం చేసినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారని నార్సింగి పోలీసులకు చెప్పిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు.