Chikiri Chikiri: పోలీసుల ‘చికిరి చికిరి’ స్టెప్పులు.. అస్సలు తగ్గడం లేదుగా, వీడియో ఇదిగో..!

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి..చికిరి’ పాట భారీ సెన్సేషన్ సృష్టించింది. తెలుగు, హిందీ వెర్షన్లలో కోట్ల వ్యూస్, రీల్స్‌తో క్రేజ్ పెరుగుతోంది. తాజాగా పోలీసులు ఈ పాటకు చిందులేసిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Chikiri Chikiri

Chikiri Chikiri

Chikiri Chikiri: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నటించిన ‘పెద్ది’ సినిమా(Peddi Movie) పై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ వీడియో సాంగ్ భారీ విజయం సాధించింది. సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాట టాప్ ట్రెండ్ అవుతోంది.

వీడియోని యూట్యూబ్‌లో చూస్తే, తెలుగు వెర్షన్ మాత్రమే 10 రోజుల్లో 51 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ పొందింది, ఇప్పటి వరకు 19 మిలియన్ వ్యూస్ ఈ వెర్షన్‌కు వచ్చాయి. పైడ్ యాడ్స్ లేకుండా ఈ విజయాన్ని సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటపై రీల్స్ ఫుల్ హీట్ తెచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు కూడా ఈ పాటకు స్టెప్పులు వేసి వీడియోలు షేర్ చేస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, అన్ని వయసుల వారు, వేర్వేరు రంగాల వారు ఈ పాటపై డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గతంలో రామ్ చరణ్ చేసిన ప్రతి హిట్ పాటలతో ఉండే రికార్డ్స్, ఇప్పుడు ‘పెద్ది’ తో మళ్లీ రిపీట్ అవుతున్నాయి అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా, పోలీసులు ప్రాక్టీస్ సమయానికి పెరేడ్ గ్రౌండ్‌లో ‘చికిరి..చికిరి’ హుక్ స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అవ్వడం, క్రేజ్‌కి కొత్త అర్థాన్ని ఇచ్చింది. మూవీ టీమ్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, పాట కొత్త బెంచ్‌ మార్క్‌లు సృష్టిస్తోంది అని తెలిపారు.

ఇక రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్, ఈ క్రేజ్ పై పెయిడ్ క్యాంపైన్ అని చెబుతున్నారు. కానీ నిజంగా పెయిడ్ అయితే ఇంత పెద్ద సంఖ్యలో రీల్స్ రావడం అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో మరో పాటను చిత్రీకరించారు. అది కూడా ఆటం బాంబ్ లా పేలుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మూవీ క్రేజ్ చూస్తూ, రామ్ చరణ్ నుండి సెన్సేషన్ రాబోతుందని అనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు