BIG BREAKING: ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ పై పోక్సో కేసు!

టాలీవుడ్ లో మరో కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదవడం సంచలనంగా మారింది. ఢీ షో కొరియోగ్రాఫర్ కృష్ణ పై గచ్చిబౌలి పీఎస్ లో పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో కేసు ఫైల్ అయ్యింది. అయితే జులై 9న కేసు నమోదవగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

New Update

BIG BREAKING:  టాలీవుడ్ లో మరో కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అయితే ఇటీవలే  జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్టై జైలుకెళ్లి.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఢీ షో, బీబీ జోడీ, డాన్స్ ఐకాన్ వంటి షోలతో పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ కృష్ణ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆమె కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కృష్ణ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 9న కేసు నమోదవగా.. ఈరోజు విషయం బయటకొచ్చింది. 

బెంగళూరులో అరెస్ట్!

కేసు నమోదవగానే అజ్ఞాతంలోకి వెళ్ళాడు కృష్ణ. దీంతో  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు .. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ తన అన్న ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం కంది జైలుకి తరలించారు. ప్రస్తుతం కృష్ణ రిమాండ్ లో ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, ఇన్ స్టాగ్రామ్ లో యువతులు, మహిళలతో పరిచయాలు పెంచుకొని.. పలువురిని మోసం చేశాడనే అభియోగాలు ఉన్నాయి. గతంలో కూడా  తన భార్యకు సంబంధించిన రూ. 9లక్షల నగదును తీసుకెళ్లాడనే ఆరోపణలు ఉన్నాయి. 

డాన్సర్ గా కెరీర్ 

ఇదిలా ఉంటే డాన్సర్ గా కెరీర్ స్టార్ చేసిన కృష్ణ.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఢీ షో, బీబీ జోడీ, డాన్స్ ఐకాన్ వంటి షోలలో కంటెస్టెంట్లకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. సూపర్ జోడీ రన్నరప్ గా, డాన్స్ ఐకాన్ విన్నర్ గా నిలిచాడు. అలా టీవీ షోలతో బాగా పాపులరైన కృష్ణ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. వరుణ్ తేజ్ 'మట్కా' తన మొదటి సినిమా. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశాడు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటాడు. తరచూ డాన్స్ వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ ఉంటాడు. కృష్ణకు  ఇన్ స్టాగ్రామ్ లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే గతంలో జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే మహిళ కొరియోగ్రాఫర్ ని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్నాడు. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్టై నెల రోజుల పాటు రిమాండ్ లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. దీని కారణంగా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు కూడా రద్దయింది. ధనుష్ తమిళ చిత్రం తిరుచిత్రంబలంలోని 'మేఘం కారుకథ' పాటకు గానూ జానీకి నేషనల్ అవార్డు వరించింది. కానీ, అంతలోనే జానీ పై లైంగిక ఆరోపణలు రావడంతో నేషనల్ అవార్డు సొంతం చేసుకోలేకపోయాడు. 

Also Read: Mahavatar Narsimha: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమేటెడ్ మూవీ.. బడా హీరోలను నెట్టేసి రూ. 100 కోట్ల దిశగా!

Advertisment
తాజా కథనాలు