Mahavatar Narsimha: స్టార్ హీరోలు లేరు, భారీ బడ్జెట్ కాదు, పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు.. అయినప్పటికీ 'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ లేకపోయినా.. కేవలం మౌత్ టాక్ ద్వారా దూసుకుపోతుంది. ఇదొక యానిమేటెడ్ సిరీస్ అయినప్పటికీ బడా హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి విజయ పరంపర కొనసాగిస్తోంది. పెద్దల నుంచి పిల్లల వరకు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో భక్త ప్రహ్లదుడిని హిరణ్యకశిపుడి నుంచి కాపాడిన కథను ఈ చిత్రంలో చూపించారు. ఒక ఆధ్యాత్మిక కథాంశాన్ని అందరికీ అర్థమయ్యేలా అద్భుతమైన విజువల్స్ తో యానిమేటెడ్ ఫార్మేట్ లో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
The divine roar echoes across Hyderabad 🔥
— Mahavatar Narsimha (@MahavatarTales) August 3, 2025
With roaring devotion and immense love,#MahavatarNarsimha takes over hearts and screens ❤️🔥
Catch the epic saga in theatres now.#Mahavatar@hombalefilms@AshwinKleem@kleemproduction@VKiragandur@ChaluveG@shilpaadhawan@SamCSmusic… pic.twitter.com/YaVWsvSV2A
'మహావతార్ నరసింహా'
భారతదేశంలో యానిమేషన్ పెద్దగా ఆడని జానర్ అయినప్పటికీ.. మంచి కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోగలదని 'మహావతార్ నరసింహా' నిరూపించింది. అంతేకాదు భారతీయ యానిమేషన్ చిత్రాలకు ఒక కొత్త ఒరువడిని చూపింది. ఈ చిత్రం 9 రోజుల్లోనే రూ. 65కోట్ల వసూలు సాదిందించి రూ.100 దిశగా పరుగులు పెడుతోంది. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు, కింగ్డమ్', 'సన్ ఆఫ్ సర్దార్ 2', ధఢక్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను మించి ఆధిపత్యం చెలాయిస్తోంది.
పలు నివేదికల ప్రకారం విడుదలైన మొదటి రోజు శనివారం రూ. 4.60 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా .. రెండవ శనివారం ఏకంగా రూ. 15 కోట్లకు చేరుకుంది. ఈ గమనీయమైన పెరుగుదల సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇండియన్ యానిమేటెడ్ చిత్రాలకు ఇది చాలా అరుదైన విజయం. ఒక సౌత్ ఇండియన్ యానిమేటెడ్ మూవీ ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. అదికూడా పలు స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసి! అజయ్ దేవగన్ 'సన్ ఆఫ్ సర్దార్ 2' శుక్రవారం రూ. 7.కోట్లు, శనివారం రూ. 7.50 కోట్ల వసూలు చేసి.. 'మహావతార్ నరసింహ' సినిమాలో సగం కూడా రాబట్టలేకపోయింది. 'ధఢక్ 2' శనివారం రూ. 3 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఇంకా కష్టపడుతోంది. ఇక విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' శనివారం రూ. 8కోట్లు మాత్రమే వసూలు చేసింది.