Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట పెను విషాదం..!

టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమర్ కుమార్ రాజ్ పుత్ 67ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

New Update
Payal Rajput

Payal Rajput

Payal Rajput: టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమర్ కుమార్ రాజ్ పుత్ 67ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పాయల్ ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. తండ్రి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. 

పాయల్ ఎమోషనల్ పోస్ట్!

నాన్నా.. క్యాన్సర్ ను జయిస్తావని అనుకున్నాను. మీరు క్యాన్సర్ తో పోరాడడానికి కావాల్సిన మనోధైర్యాన్ని ఇవ్వడానికి నేను చేయాల్సింది అంతా చేశాను. కానీ మిమల్ని కాపాడుకునే పోరాటంలో నేను విజయం సాదించలేకపోయాను. క్షమించండి నాన్న! అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాయల్ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ తారలు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 

పాయల్ సినిమాలు 

ఇదిలా ఉంటే.. పాయల్ 'ఆరెక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్  యాక్షన్ థ్రిల్లర్ గా 2018లో విడుదలైన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తెలుగు, హిందీ, పంజాబీ భాషల్లో పాయల్ కి మంచి అవకాశాలు వచ్చాయి. 'ఆరెక్స్ 100' తర్వాత తెలుగులో వెంకీ మామ , డిస్కో రాజా, జిన్నా పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్టార్ డమ్ రాలేదు ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత మళ్ళీ 2023లో 'మంగళవారం' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడింది. అజయ్ భూపతి దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో పాయల్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం పాయల్ ఆది సాయికుమార్ జోడీగా 'కిరాతక' అనే సినిమా చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వీరభద్రం డైరెక్ట్ చేస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 26న విడుదల కానుంది. సినిమాలతో పాటు కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ లో మెరిసింది పాయల్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. 

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో 4 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు ఈ ముద్దుగుమ్మకు. ఇదిలా ఉంటే.. సౌరభ్ ధింగ్రా అనే వ్యక్తితో పాయల్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అతడితో సన్నిహితంగా కలిసి ఉన్న ఫొటోలను కూడా పాయల్ పలు మార్లు తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

Also Read: Actress Kalpika: సిగరేట్లు అడిగితే ఇవ్వలేదు..రిసార్ట్ వివాదంపై కల్పిక!

Advertisment
తాజా కథనాలు