Pawan Kalyan: అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి సారి మీడియా ముందు స్పందించారు. "తొక్కిసలాట తర్వాతి రోజే హీరో గానీ, నిర్మాత గానీ బాధిత ఇంటికి వెళ్లి పరామర్శిస్తే బాగుండేది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. మేము ఉన్నామనే నమ్మకం ముందే కలిగిస్తే ఇంతవరకు వచ్చేది కాదు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా.. పనికిరాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా అదే చేసే వాడిని. తన కారణంగానే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉంది. కానీ, సినిమా అంటే టీమ్ .. అందులో అందరి భాగస్వామ్యం ఉంటుంది. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. గతంలో చిరంజీవి కూడా అభిమానులతో కలిసి చూసేందుకు థియేటర్ కి వెళ్లేవారు.. కాకపోతే ఆయన ముసుగు వేసుకొని ఒక్కరే వెళ్లేవారు" అని అన్నారు పవన్ కళ్యాణ్.
Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై
రేవంత్ గొప్ప నాయకుడు
అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఘటనకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. "తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు. కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. వైసీపీ తరహాలో అక్కడ వ్యవహరించలేదు.. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అవకాశమిచ్చారు అంటూ రేవంత్ ప్రభుత్వం ప్రశంసలు కురించారు. అల్లు అర్జున్ విషయంలో తెర వెనుక, తెర ముందు ఏం జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను.. ప్రజల భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందే చెప్పాల్సి ఉండేది'' అని అన్నారు.
Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్
Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్