NTR: ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. !

ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమా చూపిస్తూ డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాకినాడలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌ను బాధపడుతున్న ఓ రోగికి తనకు ఇష్టమైన సినిమా 'అదుర్స్' లోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్ చేశారు వైద్యులు.

New Update
ntr 1

ntr

Viral Video: సాధారణంగా తెలుగు వాళ్లకు సినిమాలన్నా, సినిమా హీరోలన్నా విపరీతమైన ఇష్టం ఉంటుంది. తెరపై తమ అభిమాన హీరోలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయ్యేంతవరకు తమకు ఎలాంటి బాధలు, సమస్యలున్నా.. మర్చిపోయి మూవీని ఎంజాయ్ చేస్తారు.

ఎన్టీఆర్ సినిమా చూస్తూ ఆపరేషన్

ఇలాంటి సంఘటనే కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. బ్రెయిన్ ట్యూమర్‌ను బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు తనకు ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొండంగి మండలం కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి అనే బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. వైద్యులు అవేక్ క్రానియోటమీ పద్దతిలో బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించే పద్దతిని అనుసరించారు. ఇందుకోసం పేషంట్ ను మెలుకువగా ఉంచడానికి తనకు ఎంతో ఇష్టమైన జానియర్ ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మానందం- ఎన్టీఆర్ కామెడీ సీన్లను చూపిస్తూ ఆపరేషన్ చేశారు. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ రెండున్నర గంటల పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఆ మహిళా మరో ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా జరగడంపై డాక్టర్లను అందరూ అభినందిస్తున్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు