NTR Fan: ''నీతో కలిసి సినిమా చూస్తా''.. అభిమానికి ఎన్టీఆర్ భరోసా! 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని కౌశిక్ వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. కౌశిక్ కు తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో తనతో కలిసి 'దేవర' సినిమా చూస్తానని మాటిచ్చారు. By Archana 14 Sep 2024 | నవీకరించబడింది పై 14 Sep 2024 17:25 IST in సినిమా వైరల్ New Update ntr fan koushik షేర్ చేయండి NTR Fan: ఇటీవలే ప్లీజ్ సర్ మా అబ్బాయిని బతికించండి.. సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి అంటూ వేడుకున్న ఎన్టీఆర్ అభిమాని తల్లి వీడియో అందరి హృదయాన్ని కలచివేసింది. ఏపీకి చెందిన కౌశిక్ చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. కొడుకు చివరి కోరిక తీర్చాలని ఆ కన్న తల్లి మీడియా ముందుకొచ్చింది. ఆమె కొడుకు చివరి కోరికగా 'దేవర' సినిమా చూడాలనుకుంటున్నాడని.. సినిమా రిలీజ్ అయ్యే వరకైనా తనను బతికించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తమ కొడుకును బతికించుకునేందుకు సహాయం చేయాలని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబును ప్రాధేయపడింది. ఆ కన్నతల్లి బాధను వినిపించేలా ఆర్టీవీ కూడా కొన్ని కథనాలను ప్రచురించింది. స్పందించిన ఎన్టీఆర్ అభిమానికి వీడియో కాల్ ఆర్టీవీ కథనాలకు... తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తారక్ తన అభిమాని కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్ ను అధైర్యపడొద్దని దైర్యం చెప్పారు. తనకు అండగా ఉంటానని కౌశిక్ తో పాటు అతని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే తనతో కలిసి 'దేవర' సినిమా చూస్తానని మాటిచ్చాడు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేయడంతో కౌశిక్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో తారక్ యాక్షన్, డైలాగ్స్, విజువల్స్ సినిమా పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి