Devara: గొర్రెను బలిచ్చి.. పైశాచిక ఆనందం.. తారక్ ఫ్యాన్స్ నిర్వాకం

పిచ్చి పరాకష్టకు చేరితే ఇలానే ఉంటుంది. దేవర సినిమా రిలీజ్‌ సమయంలో గొర్రెను బలిచ్చి శాడిజం ప్రదర్శించారు కొందరు జూనియర్ ఫ్యాన్స్. ఓ థియేటర్ దగ్గర తారక్‌ కటౌట్‌కు రక్తాభిషేకం చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update
devara44

devara

Devara:  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దేవర' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్ సందర్భంగా  థియేటర్ల ముందు భారీ భారీ కటౌట్లతో రచ్చ చేస్తున్నారు. 

గొర్రెను బలిచ్చి..  పైశాచిక ఆనందం.. తారక్ ఫ్యాన్స్ నిర్వాకం 

అయితే కొందరు జూనియర్ ఫ్యాన్స్ పైశాచిక మాత్రం పైశాచికంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పిచ్చి పరాకష్టకు చేరితే ఇలానే ఉంటుంది అన్నట్లుగా చేస్తున్నారు. 'దేవర' రిలీజ్‌ సందర్భంగా  కొత్త చెరువు  D సెంటర్ దగ్గర  గొర్రెను బలించి.. దాని రక్తంతో తారక్‌ కటౌట్‌కు రక్తాభిషేకం చేస్తూ  పైశాచిక ఆనందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అభిమానం ఉండాలి.. కానీ హద్దు దాటడం మంచిది కాదు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు