/rtv/media/media_files/2026/02/15/nikhil-swayambhu-2026-02-15-18-31-20.jpg)
Nikhil Swayambhu
Nikhil Swayambhu: నిఖిల్ సిద్ధార్థ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా ఏఐ (Artificial Intelligence) ద్వారా విజువల్స్ తయారు చేస్తున్నారని అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో, ఆయన చేసిన ఒక కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిఖిల్ ప్రస్తుతం “స్వయంభు” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే యూట్యూబ్‌లో చిన్న టెక్నికల్ సమస్య రావడంతో టీమ్ మరోసారి కొత్త వెర్షన్‌ను అప్లోడ్ చేయాల్సి వచ్చింది.
Hebah Patel: రెడ్ లెహంగాలో హెబ్బా టెంప్టింగ్ ఫోజులు.. ఫోటోలు వైరల్!
Nikhil's sharp remark has triggered curiosity and debate online.
— South Cassette (@shanmukhar64033) February 15, 2026
Actor Nikhil's latest comment has sparked strong buzz on social media
He clarified that no Al was used in Swayambhu, unlike some recent films.#NikhilSiddhartha#Swayambhupic.twitter.com/XQhbHmXL5L
కొత్త టీజర్ లింక్‌ను షేర్ చేస్తూ నిఖిల్ ఒక మాట అన్నారు. “స్వయంభు” సినిమాలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమా లాగా ఏఐ గ్రాఫిక్స్ ఉపయోగించలేదని, సినిమాలో కనిపించే ప్రతి విజువల్‌ను వీఎఫ్ఎక్స్ టీమ్ డైరెక్టర్ పర్యవేక్షణలో చేసారని స్పష్టం చేశారు.
ఆయన ఈ వ్యాఖ్య చేసిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. నిఖిల్ ఈ మాటలతో ఏ సినిమా గురించి అన్నారు? అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. కొందరు ఇతర సినిమాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసాడని భావిస్తున్నారు.
“స్వయంభు” సినిమాలో సమ్యుక్త, నభా నటేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎనిమిది భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై నిఖిల్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు.
మొత్తానికి, ఏఐ వాడకం గురించి నిఖిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. “స్వయంభు” సినిమా విడుదలకు ముందే మంచి ఆసక్తిని రేపుతోంది.
Follow Us