మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదని మెజార్టీ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావిస్తూ సురేఖకు సపోర్ట్ చేస్తున్నారు.

Konda Surekha,
New Update

సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది నటి సమంత. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పాపులారిటీ అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి అదరగొట్టేసింది. అలా పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న సామ్.. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. అనంతరం నాలుగేళ్ల తర్వాత చైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుంచి సమంతపైనే అందరూ నిందలు వేశారు. జల్సాకు అలవాటు పడిన సమంత.. పేరు ప్రతిష్టలున్న అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లడంతో ఆమెకు ఫ్రీడం పోయిందని.. అందువల్లనే చైతన్యకు విడాకులిచ్చిందని కొందరు చెప్పుకొచ్చారు. అయితే సామ్, చైతన్య ఎందుకు విడిపోయారో ఇప్పటికీ అంతుచిక్కని సమాధానం. 

అయితే వీరిద్దరు ఎందు కారణంగా విడిపోయారో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వాస్తవాలా? అవాస్తవాలా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. కేటీఆర్ వల్లే సమంత, నాగ చైతన్యలు విడిపోయారని మీడియా ముఖంగా సురేఖ చెప్పడంతో సంచలనంగా మారింది.

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అడ్డుపెట్టుకుని సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడని.. దీంతో నాగార్జున, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లమంటే దానికి ఆమె ఒప్పుకోలేదని ఆమె అన్నారు. దీని కారణంగానే సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరమైందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య, అమల, చిరంజీవి, వెంకటేష్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా మరెందరో సెలబ్రిటీలు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. అయితే మరి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

కొండా సురేఖ వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్

ట్విట్టర్ ద్వారా ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు తీవ్ర అక్షేపణీయం. చాలా మంది ఖండించారు కానీ గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డితో సహా ఇంకా చాలామంది వ్యాఖ్యలను ఖండించని వారు ఈరోజు కొండా సురేఖ గారి వ్యాఖ్యలను ఖండించడానికి అనర్హులు అని రాసుకొచ్చారు.

మరొక నెటిజన్ స్పందిస్తూ.. సమంత గారి విషయంలో సోషల్ మీడియా, మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందన బాగుంది. అందరూ కరెక్ట్‌గా కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించారు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద, చిన్న పిల్లలను కూడా వదలకుండా ఎన్నో తప్పుడు మాటలు ఇంత కంటే హీనంగా వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారని రాసుకొచ్చారు.

సమంతా గారి విషయంలో ఫిల్మ్ఇండస్ట్రీ స్పందన బాగుంది. అందరూ కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ‘‘చంద్రబాబు గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, రజనీకాంత్ గారి మీద గోరంగా మాట్లాడినప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎందుకు మాట్లాడలేదు’’ అంటే అప్పుడూ భయమా! అని అన్నారు. 

సమంత గారు ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొండా సురేఖ గారి తప్పుడు వ్యాఖ్యలు మరింత బాధను కలిగించాయి. రాజకీయ అవసరాలకు ఆమె పేరు వాడటం దారుణం. వ్యక్తిగత విషయాలను వాడి రాజకీయ లబ్ధి పొందడం బాధాకరం.

మంత్రివర్యులు కొండా సురేఖ అమ్మ వ్యాఖ్యలను ఖండిస్తున్న సినీ పరిశ్రమ, గతంలో జరిగిన ఫిల్మ్ ఇండస్ట్రీ లోని మహిళల ఫోన్ టాపింగ్ ని ఎందుకు ఖండిచడం లేదు..???

TG మంత్రి కొండా సురేఖ KTR గురించి, సినీ హిరో నాగార్జున కుటుంబసభ్యులను ఉద్దేశించి, సమంత గురించి మాట్లాడిన మాటలు ఆమే మానసిక పరిస్థితికి నిదర్శనం. ఆమే మంత్రి పదవికి అనర్హురాలు తక్షణమే రాజీనామా చేయాలి లేదా గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి.

సమంత గారికి ట్విటర్, మీడియా ద్వారా క్షమాపణ చెప్పినందుకు సురేఖ గారికి ధన్యవాదాలు. కాని, ఒక పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఒక ఆడపడుచుని పక్కలోకి రావాలని అడిగితే కుటుంబం అంత ఆత్మహత్య చేసుకున్నపుడు, ఇవ్వాళ లేచిన నోర్లు ఆ రోజు లేవదు ఎందుకు.. ఆ రోజు మీకు బాధ్యత లేదు అనుకున్నారా.

100% కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలి. అక్కినేని, దగ్గుపాటి కుటుంబసభ్యులు  కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేయాలి. భవిష్యత్తు రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe