/rtv/media/media_files/2025/12/21/nawabpeta-devara-2025-12-21-17-26-13.jpg)
Nawabpeta Devara
Nawabpeta Devara: ఊరి పండుగలు, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో దర్శకుడు మురళీకృష్ణ ముందుంటారు. ఇప్పటికే 'పొద్దుటూరు దసరా' అనే డాక్యమెంటరీతో గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు మరో గ్రామీణ డాక్యుమెంటరీతో రాబోతున్నారు. రాయలసీమ ఫేమస్ 'నవాబుపేట దేవర' పండగను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు. దీనిని బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించారు. శనివారం హైదరాబాద్ లో ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా పలువురు సినీ తారలు హాజరయ్యారు.
ప్రీమియర్ షో
బిగ్ బాస్ ఫేమ్, కమెడియన్ మహేశ్ విట్టా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ దేవర పండగను మురళీ కళ్ళకు కట్టినట్లు చూపించారని కొనియాడారు. ఇప్పటివరకు సీమ నెటివిటీని సరిగ్గా చూపించిన సినిమాలు రాలేదని, మురళీ త్వరలోనే రాయలసీమ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో ఒక పూర్తి స్థాయి సినిమా చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
కేవలం 32 గంటల్లోనే
అలాగే నిర్మాతలు బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను చూసిన దేవర పండుగను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే తాము మురళీని సంప్రదించినట్లు తెలిపారు. ఏఐ (AI) సాంకేతికతతో అమ్మవారిని అద్భుతంగా చూపించారని, ఆనంద్ అందించిన సంగీతం, నాగేంద్ర రాసిన పాటలు ఈ డాక్యుమెంటరీకి మరింత బలం చేకూర్చాయని దర్శకుడు మురళీకృష్ణ తెలిపారు. కేవలం 32 గంటల వ్యవధిలోనే టీమ్ అందరి సహకారంతో ఈ నాణ్యమైన అవుట్‌పుట్ తీసుకురాగలిగామని మురళీ సంతోషం వ్యక్తం చేశారు.
మొదట్లో డాక్యుమెంటరీస్ గురించి తనకు పెద్దగా తెలియదని.. ప్రొడ్యూసర్ ప్రేమ్ అందించిన సహకారంతో 'పొద్దుటూరు దసరా' చేశానని, ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తో 'నవాబుపేట దేవర' రూపొందించానని తెలిపారు. ప్రస్తుతం మురళీకృష్ణ తెరకెక్కించిన మొదటి డాక్యుమెంటరీ 'పొద్దుటూరు దసరా' ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది. త్వరలోనే 'నవాబుపేట దేవర' స్ట్రీమింగ్ వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read: Avatar Fire And Ash: ఒకే సినిమా ఎన్ని సార్లు చూస్తాం.. అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ
Follow Us