28°C Movie Trailer: చనిపోయిన వాళ్ళు తిరిగొస్తే..! 28°C ట్రైలర్ మాములుగా లేదుగా

నవీన్ చంద్ర, షాలిని జంటగా 'పొలిమేర' డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ '28 డిగ్రీల సెల్సియస్' (28°C) ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

New Update
28°C Movie Trailer

28°C Movie Trailer

28°C Movie Trailer : 'పొలిమేర' డైరెక్టర్('Polimera' Director) అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) కొత్త మూవీ '28 డిగ్రీల సెల్సియస్' (28°C Movie) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్. నవీన్ చంద్ర(Naveen Chandra), షాలిని జంటగా నటించిన ఈ సినిమాని మొదట కరోనాకు ముందే రిలీజ్ అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్..

అయితే, తాజాగా  ట్రైలర్ రిలీజ్ చేస్తూ మూవీపై ఇంట్రెస్ట్ పెంచేశారు మేకర్స్. హారర్ థ్రిల్లర్స్ ని అద్భుతంగా తెరకెక్కించే అనిల్ విశ్వనాథ్ మళ్ళీ '28 డిగ్రీల సెల్సియస్' అంటూ ఒక కొత్త జానర్ లో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని రూపొందించారు. రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఈ మూవీని వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు. రిలీజైన ట్రైలర్ చుస్తే కథ మొత్తం ఒక ఇంట్లోనే తిరుగుతూ, చనిపోయిన ఒక అమ్మాయిని '28 డిగ్రీల సెల్సియస్' ఉష్ణోగ్రతలో పెట్టి కాపాడాలనుకునే కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. 

Also Read: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Also Read: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు