/rtv/media/media_files/2025/10/24/nara-rohith-2025-10-24-16-13-18.jpg)
nara rohith
Nara Rohith: హీరో నారా రోహిత్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 31న నారా రోహిత్, సిరి లేళ్ల మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నారా రోహిత్ సినీ, రాజకీయ ప్రముఖులను తన వివాహ వేడుకకు ఆహ్వానించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించి అక్టోబర్ 30న జరగనున్న తన వివాహ వేడుకకు ఆహ్వానించారు. నారా రోహిత్- సిరి లేళ్ల వివాహ వేడుకలు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 25న హల్దీ వేడుకలతో పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ తెల్లాపూర్ లోని మండువా ప్రాంగణంలో హల్దీ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఐటీసీ గ్రాండ్ కాకతీయలో పెళ్లి కొడుకును చేసే వేడుక, అనంతరం మండువ ప్రాంగణంలో మెహందీ జరగనున్నట్లు తెలుస్తోంది.
It was an honour meeting Hon’ble Telangana CM @revanth_anumula garu to invite him for my wedding. Revisiting the memories of our earlier interactions made the moment truly special. https://t.co/TkXV1y7cQF
— Rohith Nara (@IamRohithNara) October 24, 2025
Follow Us