Nara Rohit Marriage: నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. పెళ్లి ఎక్కడో తెలుసా?

హీరో నారా రోహిత్- నటి సిరిలేళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే పెళ్లి పనులు కూడా మొదలైనట్లు తెలియజేస్తూ పసుపు దంచే కార్యక్రమం ఫొటోలు పంచుకున్నారు సిరిలేళ్ల.

New Update
nara rohith marriage details

nara rohith marriage details

Nara Rohit Marriage: హీరో నారా రోహిత్- నటి సిరిలేళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే పెళ్లి పనులు కూడా మొదలైనట్లు తెలియజేస్తూ పసుపు దంచే కార్యక్రమం ఫొటోలు పంచుకున్నారు సిరిలేళ్ల. అయితే పెళ్లి డేట్ ఎప్పుడు అనే వివరాలు మాత్రం ఇంకా బయటకి రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి వివరాలకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

పెళ్లి వివరాలు 

హైదరాబాద్ తెల్లాపూర్ లోని మండువా ప్రాంగణంలో హల్దీ వేడుకలతో వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ఐటీసీ గ్రాండ్ కాకతీయలో  పెళ్లి కొడుకును చేసే  వేడుక, అనంతరం మండువ ప్రాంగణంలో మెహందీ జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత అక్టోబర్ 30న పెళ్లి మూహూర్తం నిశ్చయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. నారా రోహిత్- సిరి లేళ్ల వివాహ వేడుకలు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. 

Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌

Advertisment
తాజా కథనాలు