Shiva Re- Release: అప్పట్లో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నాగార్జున సూపర్ హిట్ మూవీ 'శివ' ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ ముందుకు రానుంది. 4K డాల్బీ అట్మాస్ వర్షన్‌లో హై క్వాలిటీ ప్రింట్ తో దీనిని రీరిలీజ్ చేస్తున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ మూవీ రీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 14న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ‘ది పంచ్ ఆఫ్ శివ డాక్యుమెంటరీ’ పేరిట ఒక వీడియోను విడుదల చేశారు.
సెలబ్రెటీల జ్ఞాపకాలు..
ఈ వీడియోలో టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన స్టార్ సెలబ్రెటీలు అంతా 'శివ' సినిమా.. ముఖ్యంగా సైకిల్ సీన్ సీక్వెన్స్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభాస్, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్, మెగాస్టార్, అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా, నాగి, నాని, సుదీప్ కిచ్చా ఇలా స్టార్ సెలబ్రెటీలు అంతా 'శివ' జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సెలబ్రెటీల అభిప్రాయాలను పై వీడియోలో చూడండి.
సైకిల్ చైన్
1989లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే 'శివ' కి ముందు, 'శివ' కి తర్వాత అని చెబుతుంటారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రం నాగార్జునకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.. ఆయన కెరీర్ లోనే ఒక క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఇందులో సైకిల్ చైన్‌తో నాగార్జున చేసే ఫైట్ సీన్ అప్పట్లో యూత్‌లో ఒక ట్రెండ్‌ను సృష్టించింది. ఇప్పటికీ 'శివ' అందరికీ గుర్తొచ్చేది సైకిల్ చైన్ ఐకానిక్ సీన్! అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సన్నివేశం. ఈ చిత్రంలో నాగార్జున, అమల, రఘువరన్, తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read: Vijay - Rashmika: బిగ్ న్యూస్.. విజయ్- రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్! వైరలవుతున్న పోస్ట్
Follow Us