/rtv/media/media_files/2026/02/14/nagarjuna-2026-02-14-18-44-27.jpg)
Nagarjuna
Nagarjuna: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ చిత్రం విడుదలై రెండు నెలలు అయినప్పటికీ ప్రేక్షకులను ఇంకా ఉర్రూతలూగిస్తుంది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ దకైత్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన నటన, FA9LA పాటపై వైరల్ డాన్స్ ఇవన్నీ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.
Nagarjuna in Dhurandhar
ఇటీవల కొన్ని సోషల్ మీడియా రిపోర్ట్‌లు నాగార్జునను ఈ రెహమాన్ దకైత్ పాత్రకు మొదట ఆఫర్ చేసినట్లు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. “అసలు ఆఫర్ రాలేదు. అయినప్పటికీ ఆ అవకాశం ఉంటే బాగుండేది. ధురంధర్ చక్కగా తెరకెక్కించారు. ఆదిత్య ధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారు. URI సినిమాను కూడా నేను చాలా ఇష్టపడ్డాను. మొత్తం ఫిల్మ్‌లో నటన అద్భుతం. అక్షయ్ ఖన్నా బాగా చేశారు. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను, మరొక హిట్ రావాలి.” అని అన్నారు.
అయితే వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, నాగార్జునకు ఈ పాత్ర మొదట ఆఫర్ చేశారట, కానీ Coolie (రజనీకాంత్), Kuberaa (ధనుష్) సినిమాలతో బిజీ ఉండటం కారణంగా ఆయన తిరస్కరించారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నాగార్జున ఇప్పుడు స్పష్టత ఇచ్చారు.
ఇక ఆయన తన 100వ సినిమా పై సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను త్వరగా పూర్తి చేయాలని 100వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు నాగార్జున.
ఇక ధురంధర్ సీక్వెల్ - The Revenge మార్చి 19న థియేటర్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమానులు ఈ సినిమాలో మరిన్ని అద్భుతమైన సీక్వెన్స్‌లను చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Follow Us