ముదురుతున్న మెగా వివాదం.. మరోసారి నాగబాబు ట్వీట్ వైరల్!

నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. ''తప్పుడు మార్గంలో వెళ్తున్నావని గుర్తిస్తే మంచిది. లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం'' అని ఓ కోట్ పెట్టారు. దీంతో పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ పెట్టారా? అని అంటున్నారు నెటిజన్లు.

New Update
NAGABABU

nagababu tweet

 Nagababu: అల్లు వెర్సెస్ మెగా వివాదం అంటూ కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లకుండా.. అతని ప్రత్యర్థి పార్టీ నాయకుడు, తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేశారు.  దీంతో మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. అప్పటి నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేనట్లుగానే కనిపిస్తున్నా.. పలు ఈవెంట్లలో మెగా హీరోలు చేసే కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించినట్లుగా ఉండడం, మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ మెగా ఫ్యామిలీకి  ఇండైరెక్ట్ గా కౌంటర్ అన్నట్లుగా ఉంటున్నాయి. 

Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..

నాగబాబు ట్వీట్ వైరల్ 

ఈ క్రమంలో మరో సారి మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ''నువ్వు త‌ప్పుడు దారిలో వెళ్తున్నావ‌ని నువ్వే గుర్తిస్తే వెంట‌నే నీ దారిని మార్చుకో. నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అంటూ స్వామివివేకానంద కొటేషన్ పెట్టారు. అయితే అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఈ స్థానంలో ఉండడానికి తన నటనతో పాటు మెగాస్టార్ ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఉందని చెబుతుంటారు. కానీ అల్లు అర్జున్ ఈ మధ్య చాలా ఈవెంట్లలో తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ''నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అంటూ నాగబాబు చేసిన ట్వీట్ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ  పెట్టినట్లుగా ఉందని అనుకుంటున్నారు  నెటిజన్లు.  

Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు