/rtv/media/media_files/2026/03/05/naga-chaitanya-2026-03-05-17-52-24.jpg)
Naga Chaitanya
Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న కొత్త సినిమా వృషకర్మ. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈవెంట్ పెట్టి విడుదల చేశారు. ఆ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘వృషకర్మ’ మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో కిందపడిన హీరో నాగ చైతన్య
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2026
స్టేజీపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చునే సమయంలో వెనక్కి పడిపోయిన నాగ చైతన్య pic.twitter.com/yJRGqVdjqp
ఈ కార్యక్రమంలో స్టేజ్‌పై కుర్చీలో కూర్చున్న నాగ చైతన్య ఒక్కసారిగా కిందపడబోయాడు. కుర్చీ వెనక్కి ఒరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవారు వచ్చి ఆయనను పైకి లేపారు. అయితే చైతన్య మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ లైట్‌గా తీసుకున్నాడు.
మిస్టరీ థ్రిల్లర్ కథతో ‘వృషకర్మ’
నాగ చైతన్య ఈసారి ప్రేక్షకుల ముందుకు ఒక భిన్నమైన కథతో రాబోతున్నాడు. వృషకర్మ సినిమా మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది. ఈ సినిమాలో చైతన్య అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని నాగ చైతన్య చెప్పాడు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని అతడు నమ్మకం వ్యక్తం చేశాడు. అలాగే ఇది తండేల్ సినిమాకంటే కూడా పెద్ద స్థాయిలో ఉంటుందని పేర్కొన్నాడు.
వృషకర్మ సినిమాలో అర్జున్ పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి డైరెక్టర్ కార్తీక్ దండు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉపయోగించాడని నాగ చైతన్య చెప్పాడు. ప్రీ-ప్రొడక్షన్ సమయంలో డైరెక్టర్ తనకు సుమారు 100 ప్రశ్నలు పంపించాడని తెలిపాడు. ఆ ప్రశ్నలకు తాను సమాధానాలు రాయమని చెప్పాడని, అదే ప్రశ్నలకు డైరెక్టర్ కూడా తన సమాధానాలు రాసాడని చెప్పాడు.
తర్వాత ఇద్దరి సమాధానాలను చూసి పాత్ర గురించి ఇద్దరికీ ఎంత వరకు ఒకే విధమైన ఆలోచన ఉందో తెలుసుకోవాలని డైరెక్టర్ చెప్పాడని చైతన్య వివరించాడు. ఈ విధంగా అర్జున్ పాత్రపై వారు చాలా పని చేసినట్లు తెలిపాడు.
సినిమాలో ఎక్కువగా వీఎఫ్ఎక్స్
వృషకర్మ సినిమాలో భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ (VFX) ఉపయోగించనున్నట్లు నాగ చైతన్య తెలిపాడు. సినిమా మొత్తం దాదాపు 70 శాతం వరకు వీఎఫ్ఎక్స్ ఉంటుందని చెప్పాడు. అందుకోసం భారీ ఖర్చు కూడా చేశారని తెలిపాడు. ఈ సినిమా తన కెరీర్‌లో కొత్త దశను ప్రారంభించే చిత్రంగా ఉంటుందని కూడా తెలిపాడు.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
నాగ చైతన్య మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. తాను తండేల్ సినిమా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు వృషకర్మ కథ రాస్తున్నాడని తెలిసిందని అన్నాడు.
అప్పుడు తానే వెళ్లి ఈ సినిమాలో తనకు అవకాశం ఉంటే చెప్పమని అడిగానని తెలిపాడు. కొంతకాలం తర్వాత డైరెక్టర్ టీమ్ తనకు ఈ పాత్ర ఇచ్చిందని చెప్పాడు. ఆ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
వృషకర్మ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్
ఇటీవల విడుదలైన వృషకర్మ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను విరూపాక్షతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Follow Us