Hansika: గృహ హింస కేసులో నటి హన్సిక.. షాకిచ్చిన హైకోర్టు !

నటి హన్సిక మోత్వానికి ముంబై హైకోర్టు షాకిచ్చింది. గతంలో ఆమె వదిన.. తనతో పాటు ఆమె తల్లిపై పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే తాజాగా దీనిపై విచారణ జరిపిన హాయ్ కోర్టు హన్సికకు  షాకిచ్చింది.

New Update
hansika

hansika

Hansika: నటి హన్సిక మోత్వానికి ముంబై హైకోర్టు షాకిచ్చింది. గతంలో ఆమె వదిన.. తనతో పాటు ఆమె తల్లిపై పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలంటూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే తాజాగా దీనిపై విచారణ జరిపిన హాయ్ కోర్టు హన్సికకు  షాకిచ్చింది. ఆమె దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 డిసెంబర్ 18న హన్సిక సోదరుడి భార్య ముస్కాన్ ఫిర్యాదు మేరకు అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో హన్సిక, ఆమెతల్లి, సోదరుడి పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 

అసలేం జరిగింది...

అయితే  హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ 2020లో టీవీ నటి ముస్కాన్‌ జేమ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ జంట విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ముస్కాన్ హన్సిక, ఆమె తల్లి జ్యోతిక, భర్త ప్రశాంత్ పై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని, ప్రశాంత్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, ఆమె తల్లి జ్యోతిక కూడా తమ మధ్య గొడవలు పుట్టించారని ఆరోపించింది. ఈ మేరకు హన్సిక, ఆమె కుటుంబం పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ముంబై సెషన్ కోర్ట్ హన్సిక, జ్యోతిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  అయినప్పటికీ..  హన్సిక తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కావాలనే ఈ కేసు పెట్టారని, తమపై పెట్టిన కేసు కొట్టివేయాలని ముంబై కోర్టులో క్యాష్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హన్సిక పిటీషన్ కొట్టివేసింది. ముస్కాన్ పెట్టిన కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 

Also Read: Kishkindhapuri Review: సస్పెన్స్ తో చంపేశాడు భయ్యా.. లాస్ట్ మినిట్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్.. 'కిష్కిందపురి' ఫస్ట్ రివ్యూ ఇదే!

Advertisment
తాజా కథనాలు