Mrunal Song Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌.. రామ్ చరణ్ తో మృణాల్ స్టెప్పులు..!

మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ హీరోగా రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో ఐటెం సాంగ్‌లో నటించనున్నారు. సినిమా మార్చ్ 27, 2026న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. థియేటర్ రన్ తర్వాత Netflixలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతుంది.

New Update
Mrunal Song Peddi

Mrunal Song Peddi

Mrunal Song Peddi: ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) కథానాయకుడిగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఓ ప్రత్యేక ఐటెం సాంగ్‌లో నటించనున్నారు.

ఇందుకు సంబంధించి చిత్ర నిర్మాతలు ఇప్పటికే మృణాల్‌తో సంప్రదించారని తెలుస్తోంది(Mrunal Thakur Item Song in Peddi), ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ పాటను భారీ హంగులతో, అద్భుతమైన సెట్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే పాట కోసం ఒక హుషారైన, ఆకట్టుకునే ట్యూన్ సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో అగ్ర కథానాయికలు చిన్న కాల్షీట్లలో ప్రత్యేక పాటల్లో నటించడం ఒక ట్రెండ్‌గా మారింది. తక్కువ సమయానికి మంచి పారితోషికం, యువతలో ఇలాంటి పాటలకు ఉన్న క్రేజ్ కారణంగా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌లో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. అలాగే, అల్లు అర్జున్- అట్లీ కలయికలో రానున్న పాన్ వరల్డ్ చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.

‘పెద్ది’ రిలీజ్ & OTT వివరాలు

రామ్ చరణ్ RRR తర్వాత భారీ ప్రాజెక్ట్‌గా ‘పెద్ది’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. సినిమాను థియేటర్స్‌లో మార్చ్ 27, 2026న విడుదల చేయాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు పొడవైన జుట్టు, రగ్గడ్ బియర్డ్, మస్క్యులర్ ఫిజిక్‌తో దర్శనమివ్వనున్నారు.

సినిమా థియేటర్ రన్ తర్వాత ఇంట్లో వీక్షించాలనుకునే ప్రేక్షకుల కోసం డిజిటల్ విడుదల కూడా ప్లాన్ చేశారు. Netflix ఇప్పటికే స్ట్రీమింగ్ రైట్స్ పొందింది. సినిమాకు థియేటర్ రన్ పూర్తయిన తర్వాత, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతుంది.

రిలీజ్ డేట్ చర్చలు

తాజాగా బాక్సాఫీస్ పోటీ కారణంగా ‘పెద్ది’ రిలీజ్ డేట్ చుట్టూ చర్చలు పెరుగుతున్నాయి. ధురంధర్ 2 మార్చ్ 19న రిలీజ్ అవ్వనుంది, ఇది ‘పెద్ది’కంటే ఎనిమిది రోజులు ముందే. అయితే ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ చిత్ర విడుదలలో మార్పు లేదని స్పష్టం చేశారు.

‘పెద్ది’ టీమ్ నుండి అధికారికంగా ఎలాంటి మార్పు ప్రకటించలేదు, ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రామ్ చరణ్ ఈ చిత్రానికి సంబంధించి భారీ ప్రాజెక్ట్ కనుక, రిస్క్ తీసుకోవడానికి జాగ్రత్త పడుతున్నారు. ఈ రిలీజ్ డేట్ మారుతుందా లేక అదే డేట్ ఉంటుందా అనేది త్వరలో స్పష్టం అవుతుంది.

Advertisment
తాజా కథనాలు