L2: Empuraan: అన్ని సినిమాలు "కేజీఎఫ్"లు అయిపోవు.. రూట్ మారిస్తే బెటర్..!

పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ నటించిన L2: ఎంపురాన్ (లూసిఫర్ 2) మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ "కేజీఎఫ్" తరహా ఉందంటూ ఇప్పుడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

New Update
L2: Empuraan

L2: Empuraan

L2: Empuraan: ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ కి కొత్త అర్థం చెప్పిన సినిమా "కేజీఎఫ్"(KGF) .. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ క్రియేట్ చేసిన సంచలనాలు అంతా ఇంతా కాదు. చాలామంది సినిమాటోగ్రాఫర్లకు కూడా ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ లా నిలిచింది. "కేజీఎఫ్" ని కాపీ కొడుతూ చాలా మూవీస్ చేతులు కార్చుకున్నాయి. కబ్జా, మైఖేల్, విక్రాంత్ రోణ ఇవ్వన్నీ ఆ కోవకు చెందినవే. అయినాసరే ఇంకా  "కేజీఎఫ్" తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి అందుకు ఉదాహరణ L2: ఎంపురాన్ (లూసిఫర్ 2). 

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

సినిమా నిండా "కేజీఎఫ్" ఛాయలు

అయితే, పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ నటించిన ఈ మూవీ కూడా  "కేజీఎఫ్" తరహా లోనే ఉండడం పై ఇప్పుడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.  పృధ్వీరాజ్ కు దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ఉంది,  పృధ్వీ మొదటి చిత్రం "లూసిఫర్" లో స్పష్టంగా పృధ్వీ మేకింగ్ స్టైల్   కనిపించింది. కానీ మూడవ సినిమా "ఎంపురాన్"కి వచ్చేసరికి సినిమా నిండా "కేజీఎఫ్" ఛాయలు కనిపించడం విశేషంగా మారింది.

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

పృథ్వి "ఎంపురాన్" కథ రాసుకునే సమయం లో "కేజీఎఫ్-2" విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనితో  "ఎంపురాన్" లోని స్క్రీన్ ప్లే, విజువల్ ఎలివేషన్స్ కూడా అదే తరహాలో రాసుకొని తెరకెక్కించినట్లుగా బాగా కనబడింది. "ఎంపురాన్" సినిమా చుసిన ప్రతి  ఒక్కరికీ "కేజీఎఫ్" గుర్తుకు రాక మానదు. 

Also Read: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

ఇంకా ఎండ్ కార్డ్స్ విషయానికి వస్తే అక్కడ కూడా "లూసిఫర్ 3" అంటూ డైరెక్టర్ పృథ్వి చూపించిన విధానం "కేజీఎఫ్-2" ఎండ్ కార్డ్స్ లాగానే అనిపించింది. పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి డైరెక్టర్ తన సొంత స్టైల్ వదిలేసి ఇలా "కేజీఎఫ్-2"ని చూసి అదే స్టైల్ లో "ఎంపురాన్"ని తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అని ఇప్పుడు చర్చ నడుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు