మంచు ఫ్యామిలీ గొడవను పూసగుచ్చినట్లు చెప్పిన ఇంటి పనిమనిషి!

మోహన్ బాబు ఇంటి పని మనిషి మంచు ఫ్యామిలీ వివాదాన్ని బయటపెట్టింది. మనోజ్ భార్య మౌనిక విషయంలోనే వాళ్ళకు గొడవలు మొదలయ్యాయని తెలిపింది. ముందుగా మనోజ్ తండ్రి మోహన్ బాబుపై చేయి చేసుకున్నారని. మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టారని సంచలన విషయాలు బయటపెట్టింది.

New Update

Manchu Family:  మంచు ఫ్యామిలీ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  కొడుకు మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మోహన్ బాబు  ఫిర్యాదు మేరకు మనోజ్ భార్య మౌనిక పై కేసు నమోదవగా.. మరోవైపు మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

మంచు ఫ్యామిలీ గుట్టు భయపెట్టిన పనిమనిషి 

ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీ గొడవలకు కారణమేంటి అనేదాని పై మోహన్ బాబు ఇంటి పనిమనిషి సంచలన విషయాలు బయటపెట్టింది.  పనిమనిషి మాట్లాడుతూ.. "రెండు రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తిని మనోజ్ కొట్టేందుకు వచ్చాడు. ఆ సమయంలో మోహన్ బాబు తన స్టాఫ్ ని కొట్టవద్దంటూ మనోజ్ ని నెట్టేశాడు. దీంతో మనోజ్ మోహన్ బాబుపై చేయి చేసుకున్నారు. ఈ గొడవలో నాకు తెలిసినంత వరకు ఎవరికీ దెబ్బలు తగల్లేదు.. కేవలం నెట్టుకున్నారంతే. ప్రసాద్ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా మోహన్ బాబుతో పని చేస్తున్నాడు. అయితే మనోజ్, విష్ణు మధ్య కూడా మనస్పర్థలు ఉన్నాయి. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు. మౌనిక మొదటి భర్త కొడుకు మనోజ్ తో ఉండడం మొదటి నుంచి కుటుంబానికి ఇష్టం లేదు" అంటూ మంచు ఫ్యామిలీ వివాదం గురించి సంచలన నిజాలు బయటపెట్టింది పనిమనిషి. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు