Chiranjeevi MSG: బాస్ ఈజ్ బ్యాక్.. బుక్‌మైషోలో మెగా బుకింగ్స్.. గంటకు ఎన్ని టిక్కెట్లంటే..?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభం సాధించింది. రెండు రోజుల్లో రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి, బుక్‌మైషోలో భారీ టికెట్ అమ్మకాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Chiranjeevi MSG

Chiranjeevi MSG

Chiranjeevi MSG: సంక్రాంతి పండగ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పండగ వాతావరణానికి తగ్గట్టుగా ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది సంక్రాంతి పోటీ చిత్రాల మధ్య కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో సందడి చేస్తున్నాయి.

బుక్‌మైషోలో కూడా ఈ సినిమా మంచి రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో సుమారు 4 లక్షల 7 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కొద్దిగా తగ్గినా, గంటకు సగటున 29 వేల టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఒకేసారి మూడు ఇతర సినిమాలు థియేటర్లలో ఉన్నా కూడా ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం సినిమా బలాన్ని చూపిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి చాలా రోజుల తర్వాత తన వింటేజ్ స్టైల్‌లో కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ఆయన మాస్ డైలాగ్స్, కామెడీ టైమింగ్, డ్యాన్స్ స్టెప్పులు థియేటర్లలో విజిల్స్ వేపిస్తున్నాయి. ముఖ్యంగా చిరు డ్యాన్స్‌ను పెద్ద స్క్రీన్‌పై మళ్లీ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ విక్టరీ వెంకటేష్ చేసిన గెస్ట్ రోల్. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. వెంకటేష్ కామెడీ, ఎమోషన్, చిరంజీవితో కలిసి చేసిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. సచిన్ ఖేడేకర్, జరినా వాహబ్, క్యాథరిన్ ట్రెసా, హర్ష వర్ధన్, అభినవ్ గోమటంతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.

సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న సినిమా గా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు